Advertisementt

శంకర్ దర్శకత్వంలో పవన్-చరణ్?

Sun 17th Jan 2021 09:58 PM
ram charan,pawan kalyan,director shankar,crazy combo,charan - pawan combo  శంకర్ దర్శకత్వంలో పవన్-చరణ్?
Pawan-Charan directed by Shankar? శంకర్ దర్శకత్వంలో పవన్-చరణ్?
Advertisement
Ads by CJ

తమిళ భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ క్రేజీ స్టార్ హీరోస్ పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ కాంబోలో మూవీ. వినడానికే అదిరిపోపోతుంది. భారీ బడ్జెట్ తో భారీ సెట్టింగ్స్ వేసి, భారీ గ్రాఫిక్స్ తో టెక్నీకల్ గా హై ఎక్సపెక్ట్షన్స్ తో సినిమాని తెరకెక్కించే శంకర్ ప్రస్తుతం కమల్ తో భారతీయుడు 2 సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ ఒక షెడ్యూల్ తర్వాత ఆ సినిమా షూటింగ్ అటకెక్కింది. ప్రస్తుతం శంకర్ ఖాళీ. అయితే రామ్ చరణ్ - పవన్ కాంబో కోసం ఓ కథ సిద్ధం చేసుకుని పవన్ కి వినిపించినట్లుగా వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. సౌత్ సూపర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో బాబాయ్ - అబ్బాయ్ సినిమా.. ఈ కాంబో నిజమైతే ట్రెండ్ సెట్ చెయ్యడం గ్యారెంటీ.

హై బడ్జెట్ లో పవన్ - చరణ్ కాంబోలో శంకర్ కథ  ప్లాన్ చేసుకుని స్క్రిప్టుని పవన్ ని కలిసి వినిపించాడని, పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ కోసం శంకర్ వెయిటింగ్ అంటూ సోషల్ మీడియాలో న్యూస్. ఇక సోషల్ మీడియా టాక్ ప్రకారం ఈ కథలో పవన్ కళ్యాణ్ కి రామ్ చరణ్ కి సరిసమానమైన పాత్రలు ఉంటాయని, ఇందులో గ్రాఫిక్స్ కి చోటు ఉండదని అంటున్నారు. మాములుగా పవన్ - చరణ్ కాంబో అంటేనే హై ఎక్సపెక్ట్షన్స్ ఉంటాయి.. ఆ కాంబోలో శంకర్ డైరెక్షన్ అంటే మాములు క్రేజ్ కాదు.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR తర్వాత మళ్ళీ అంత గొప్పగా ఈ సినిమాపై క్రేజ్ ఉంటుంది అని ట్రేడ్ వర్గాల అంచనా.

Pawan-Charan directed by Shankar?:

 Pawan-Charan directed by Shankar?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ