Advertisementt

రౌడీ రాకకు టైం ఫిక్స్ అయ్యింది

Sun 17th Jan 2021 07:06 PM
vijay deverakonda,puri,karan johar,dhrma productions,puri connects,first look  రౌడీ రాకకు టైం ఫిక్స్ అయ్యింది
Time is fixed for the arrival of the rowdy రౌడీ రాకకు టైం ఫిక్స్ అయ్యింది
Advertisement
Ads by CJ

కరోనా క్రైసిస్ తో షూటింగ్స్ అన్ని వాయిదా పడ్డాయి. గత సెప్టెంబర్ నుండే అన్ని సినిమాలు తమ తమ టీమ్స్ తో సెట్స్ మీదకెళ్ళిపోయాయి. కానీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ పాన్ ఇండియా ఫిలిం ఫైటర్ మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు. కారణం విదేశీ ఫైటర్స్ రాక ఆలస్యం అవడంతో ఫైటర్ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా మొదలైనప్పటినుండి విజయ్ దేవరకొండ బాక్సర్ లుక్ లోనే అంటే లాంగ్ హెయిర్ తోనూ, బాడీ ఫిట్నెస్ కోసం జిమ్ వర్కౌట్స్ లోనే ఉన్నాడు. గత కొన్ని నెలలుగా విజయ్ అదే లుక్ ని కంటిన్యూ చేస్తున్నాడు.

ఎప్పుడెప్పుడు విజయ్ సెట్స్ మీద కెళతాడా అని అయన అభిమానులు ఎదురు చూపులున్నాయి. తాజాగా విజయ్ - పూరి పాన్ ఇండియా మూవీ రీ షూట్ కి టైం ఫిక్స్ అయ్యింది. అంతేకాదు విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ ఫస్ట్ లుక్ కి రంగం సిద్ధమైంది. జనవరి 18 ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టుగా ఈ సినిమా మరో నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ - పూరి కనెక్ట్ టీమ్స్ తెలియజేసారు. అయితే టైటిల్ విడుదల చేస్తున్నట్టుగా రివీల్ చెయ్యలేదు. ఫస్ట్ లుక్ తో పాటుగా టైటిల్ కూడా వస్తుందా అని రౌడీ అభిమానుల ఆత్రుత మరింత ఎక్కువైంది.

Time is fixed for the arrival of the rowdy:

Vijay Deverakonda - Poori Movie Resume Fighter shoot

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ