Advertisementt

రామ్ కి పోటీ ఎవరో తెలుసా?

Sun 17th Jan 2021 01:44 PM
ram,red movie,red blockbuster celebrations,ram speech  రామ్ కి పోటీ ఎవరో తెలుసా?
Do you know who Ram is competing with? రామ్ కి పోటీ ఎవరో తెలుసా?
Advertisement
Ads by CJ

ఏ హీరో కైనా మరో హీరో తో పాటి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకప్పుడు అక్కినేని - ఎన్టీఆర్ మధ్యన పోటీ నడిస్తే తర్వాత చిరు - నాగార్జున - బాలయ్య - వెంకీల మధ్యన పోటీ నడిచింది. తర్వాత తరంలో ఎన్టీఆర్ - చరణ్ - ప్రభాస్ - పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్ - మహేష్ ల మధ్యన పోటీ నడవడమే కాదు.. టాలీవుడ్ టాప్ చైర్ కోసం పవన్ vs ప్రభాస్ అంటూ పోటీ నడుస్తుంది. ఇక యంగ్ హీరోలలో రామ్ - నాని - నితిన్ - వరుణ్ ఇలా పోటీ మొదలయ్యింది. తాజాగా రెడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ తాను ఎవరితో పోటీ పడుతున్నాడో చెప్పి షాకిచ్చాడు.

తనకి సినిమా ఇండస్ట్రీలో పోటీ ఎవరో అనేది గత రాత్రి జరిగిన రెడ్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ లో బయటపెట్టాడు. ఇస్మార్ట్ శంకర్ తో భారీ మాస్ హిట్ కొట్టిన రామ్.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ సినిమా చేసాడు. రెడ్ కి కరోనా కష్టాలు వెంటాడినా చివరికి థియేటర్స్ లో సినిమాని విడుదల చెయ్యగా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా జరిగిన సక్సెస్ సెలెబ్రేషన్స్ లో రామ్ మాట్లాడుతూ రెడ్ విడుదలకు ముందు బాగా టెంక్షన్ పడ్డామని, కానీ సినిమాని ప్రేక్షకులు ఆదరించిన తీరు చూసి సంతోషం వేసింది అని, రెడ్ సినిమాని హౌస్ ఫుల్ చేసి కలెక్షన్స్ ని భారీగా ఇచ్చిన ప్రేక్షకులకు రామ్ థాంక్స్ చెప్పాడు.

అంతేకాదు ఈ ఇండస్ట్రీలో తనకి పోటీ ఎవరో ఇన్నాళ్ళకి తెలిసింది అంటున్నాడు. 15 ఏళ్ళ క్రితం దేవదాసుతో సంక్రాంతికే థియేటర్స్ సందడి చేశాను. మళ్లీ ఇన్నాళ్ళకి రెడ్ తో. ఈ మధ్య ప్రయాణంలో మీకు ఎవరు పోటీ అనే ప్రశ్న చాలామంది అడిగారు. నాకు ఇన్నిరోజులకి అది అర్ధమైంది. నాకు పోటీ మీరే అంటూ అభినులని చూపిస్తూ రామ్ చెప్పాడు. అంటే రామ్ కి పోటీ అభిమానులే అన్నమాట. వాళ్ళు చూపించే ప్రేమే నాకు నిజమైన పోటీ. మీరు నాపై చూపించే ప్రేమ ఎక్కువా.. లేదంటే నేను స్క్రీన్ పై చూపించే ప్రేమ ఎక్కువా అనేది చూపిస్తా అంటున్నాడు రామ్. 

Do you know who Ram is competing with?:

Ram Red Blockbuster Celebrations in Vizag

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ