బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ - అఖిల్ మధ్యన ఏదేదో జరిగిపోయినట్లుగా చూపించేసారు. అంటే హగ్గులు, ముద్దులు చూసిన ప్రేక్షకులు మోనాల్ - అఖిల్ మధ్యలో సం థింగ్ సం థింగ్ అంటూ ఫిక్స్ అయ్యారు కూడా. వాళ్ళ ప్రవర్తన చూసిన ఎవ్వరైనా అదే అనుకుంటారు. అఖిల్ అయితే మోనాల్ ఏం చేసినా మోనాల్ ని వదలకుండా పట్టుకుని కూర్చున్నాడు. ఆ విషయంలో అభిజిత్ తో గొడవలు కూడా పడ్డాడు. అయితే బిగ్ బాస్ లో చివరి అంకంలో మోనాల్ ని అఖిల్ కాస్త దూరం పెట్టాడు. ఇక బయటికొచ్చాక కూడా మోనాల్ - అఖిల్ బంకలా అతుక్కునే ఉన్నారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ దగ్గరనుండి.. నిన్నమొన్నటి సోహెల్ పార్టీ వరకు అఖిల్ - మోనాల్ జంట సోషల్ మీడియాలో ట్రేండింగ్ లోనే ఉన్నారు. అయితే బయటికి వచ్చాక వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని అనుకుంటే.. మెం ఫ్రెండ్స్ అంటూ షో చేసారు.
అయితే అఖిల్ - మోనాల్ జంటగా మారతారనుకున్న వారికీ షాకిస్తూ మోనాల్.. అఖిల్ మీద సంచనలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కెరీర్ లో జోరు మీదున్న మోనాల్ ని ఓ ఇంటర్వ్యూ లో బిగ్ బాస్ స్నేహితుడు అఖిల్ గురించి అడగగా.. ఎందుకు పదే పదే అఖిల్ గురించి మాట్లాడతారు. నేను అక్కడికి వెళితేవెళితే అక్కడికి అఖిల్ వచ్చేస్తాడా.. అయినా అఖిల్ ఏం చేస్తున్నాడో నాకెలా తెలుస్తుంది. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక కేవలం మూడుసార్లు మాత్రమే అఖిల్ ని కలిశానని చెప్పిన మోనాల్ అఖిల్ నే కాదు అభిజిత్, లాస్య, హరిక, సోహెల్ ని కూడా కలిశానని.. కానీ ఆ విషయం పెద్దది కాదు కానీ.. నేను అఖిల్ ని కలిస్తే మాత్రం రాద్దంతా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యింది.