ఇప్పటికింకా నా వయసు నిండా పదహారు.. అంటూ పోకిరి సినిమాలో ఐటెం సాంగ్ తో కుర్రకారు గుండెల్లో పవర్ పుట్టించిన ముమైత్ ఖాన్.. ప్రస్తుతం ఐటెం ఆఫర్స్ కూడా దొరక్క నానా కష్టాలు పడుతుంది. గత కొంతకాలంగా విపరీతంగా బరువు పెరిగిన ముమైత్ ఖాన్.. ఈమధ్యన ఓం కార్ వ్యాఖ్యాతగా మొదలైన డాన్స్ ప్లస్ షో కి జేడ్జ్ గా వ్యవహరిస్తోంది. అయితే ఇప్పుడు ముమైత్ బరువైన అందాలు హాట్ గర్ల్ మోనాల్ ముందు తేలిపోతున్నాయి. అంటే మోనాల్ బిగ్ బాస్ ద్వారా గ్లామర్ గర్ల్ గా బాగా పాపులారిటీ సంపాదించి ప్రస్తుతం గ్లామర్ షోతో కెరీర్ లో దూసుకుపోతుంది. అల్లుడు అదుర్స్ లో క్లివేజ్ షో ఐటెం సాంగ్ తో అదరగొట్టిన మోనాల్ అందాలు డాన్స్ ప్లస్ స్టేజ్ మీద మరింతగా వెలిగిపోతున్నాయి.
మోనాల్ కి హీరోయిన్ అవకాశలు తప్ప మిగత అవకాశాలు అంటే ఐటెం సాంగ్స్, అలాగే కేరెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలే వస్తున్నాయి. మరి ముమైత్ ఖాన్ కూడా బిగ్ బాస్ కి వెళ్లి వచ్చి ఆఫర్స్ పట్టేద్దామనుకుంది. కానీ ముమైత్ కి సుడి తిరగలేదు. కానీ బిగ్ బాస్ సీజన్ 4 కి వెళ్లొచ్చిన మోనాల్ గజ్జర్ సుడి మాత్రం బాగా తిరిగింది. అందుకే అదిరే అవకాశాలతో అదరగొడుతుంది. మోనాల్ గజ్జర్ ప్రస్తుతం తన ఫ్రెండ్స్ ని కలిసే తీరిక కూడా లేదంటుంది. అంటే కెరీర్ లో ఇప్పుడు మోనాల్ మంచి అవకాశాలతో మునిగి తేలుతుంది అన్నమాట. అయితే డాన్స్ ప్లస్ షో లో మోనాల్ అందాల ముందు ముమైత్ ఎలాంటి అందాలు ఆరబోసినా, ఎంత గ్లామర్ షో చేసినా దిగదుడుపులాగే ఉంది.