ప్రతి ఏడాది సంక్రాంతికి బడా భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్స్ కి క్యూ కట్టేవి. స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ తో కళకళలాడేవి. కానీ ఈ ఏడాది ఏ ఒక్క స్టార్ హీరో సినిమా థియేటర్స్ లో దిగలేదు. మీడియం బడ్జెట్ సినిమాలే థియేటర్స్ లో సందడి చేసాయి. అది కూడా 50 పర్సెంట్ అక్యుపెన్సీతో. కరోనా కారణంగా థియేటర్స్ అన్ని 50 శాతం ప్రేక్షకులతోనే రన్ అయ్యాయి. అయితే ఎప్పుడూ బడా బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు చూసి సంక్రాంతిని సెలెబ్రేట్ చేసుకునే ఆడియన్స్ ఈసారి కూడా థియేటర్స్ కి క్యూ కట్టారు. ఎలాంటి సినిమాలున్న సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్స్ కళకళలాడుతుంటాయి. యూత్ మొత్తం కోడి పందేలతో బిజీ అయితే.. ఫ్యామిలియస్ మొత్తం థియేటర్స్ కి పోయి ఎంజాయ్ చేస్తారు.
ఈసారి అదే పరిస్తితి. థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో చాలామంది ఆడియన్స్ టికెట్స్ దొరక్క నిసరాసతో వెనక్కి తిరిగారు. ఏ ఒక్క థియేటర్స్ చూసినా అదే హౌస్ ఫుల్ బోర్డ్స్. రవితేజ క్రాక్, విజయ్ మాస్టర్, రామ్ రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలకు సో సో టాక్ వచ్చినా.. ఆడియన్స్ వెనక్కి తగ్గలేదు. సినిమాలకి ఎలాంటి టాక్ పడినా అన్ని థియేటర్స్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డ్స్. కానీ కలెక్షన్స్ కళకళలు లేవు. బాక్సాఫీసు మెరుపులు లేవు. కారణం 50 శాతం ఆక్యుపెన్సీ. ఈ సంక్రాంతి సినిమాలని కరోనా తో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ ముంచేసింది. థియేటర్స్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డ్స్ చూసిన వారు అబ్బ ఈ హీరోల పంట పండింది. ఎలాంటి టాక్ వచ్చినా గట్టెక్కాస్తారు అనుకుంటే.. ఇప్పుడు కలెక్షన్స్ విషయంలో భారీ కోత పడింది. అందులోను హీరోలకు ఆయువు పట్టు ఓవర్సీస్ లో ఈ కరోనా వలన కోలుకోలేని దెబ్బె పడింది.