Advertisementt

అల్లు అర్జున్ కి హీరోయిన్ దొరికేసింది

Thu 21st Jan 2021 01:19 PM
saiee manjrekar,allu arjun,koratala shiva  అల్లు అర్జున్ కి హీరోయిన్ దొరికేసింది
Allu Arjun found the heroine అల్లు అర్జున్ కి హీరోయిన్ దొరికేసింది
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప పాన్ ఇండియా ఫిలిం లో నటిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివ తో మరో మూవీ ని అనౌన్స్ చేసాడు. ఇక కొరటాల శివ కూడా చిరు తో ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. చిరు - రామ్ చరణ్ కాంబోలో మెగా మల్టీస్టారర్ గా తెరకెక్కిస్తున్న ఆచార్య ఫినిష్ కాగానే కొరటాల బన్నీ సినిమా స్క్రిప్ట్ లో కూర్చుంటాడు. అయితే అల్లు అర్జున్ కి స్టోరీ లైన్ చెప్పి ఇంప్రెస్స్ చేసి మూవీ అనౌన్సమెంట్ ఇప్పించిన కొరటాల.. ఇప్పుడు బన్నీ కి హీరోయిన్ ని కూడా ఎంపిక చేసాడనే టాక్ మొదలైంది.

అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ భామ, సల్మాన్ ఖాన్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ ని సెలెక్ట్ చేసినట్లుగా సోషల్ మీడియా టాక్. దబాంగ్ 3 తో సల్మాన్ లవర్ గా మెప్పించిన బాబ్లీ గర్ల్ సాయి మంజ్రేకర్ ని కొరటాల శివ - అల్లు అర్జున్  కాంబో కోసం ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. గతంలో అంటే సర్కారు వారి పాటలో మహేష్ కి జోడిగా సాయి మంజ్రేకర్ పేరు వినిపించినా.. ప్రస్తుతం అల్లు అర్జున్ కోసం మాత్రం సాయి మంజ్రేకర్ పేరు గట్టిగా వినిపిస్తుంది. త్వరలోనే హీరోయిన్ విషయం అధికారిక ప్రకటనతో తెలియజేస్తారని తెలుస్తుంది.

Allu Arjun found the heroine:

Saiee Manjrekar Romance to Allu arjun

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ