Advertisementt

ఇలాంటప్పుడు బాలీవుడ్ ఎంట్రీనా?

Fri 15th Jan 2021 08:31 PM
bollywood entry,alludu adhurs,bellamkonda sreenivas  ఇలాంటప్పుడు బాలీవుడ్ ఎంట్రీనా?
Bollywood entry like this? ఇలాంటప్పుడు బాలీవుడ్ ఎంట్రీనా?
Advertisement
Ads by CJ

తెలుగు హీరోలు పాన్ ఇండియా మూవీస్ చేసాక లేదంటే, ఫుల్ క్రేజ్ వచ్చాక కానీ బాలీవుడ్ లో స్ట్రయిట్ మూవీస్ చేసేందుకు ధైర్యం, సాహసం చెయ్యరు. ప్రభాస్ బాహుబలి క్రేజ్ తర్వాత సాహో, రాధేశ్యాం తర్వాత ఓం రౌత్ తో ఆదిపురుష్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే రామ్ చరణ్ - ఎన్టీఆర్ RRR తో పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తుంటే.. విజయ్ దేవరకొండ ఫైటర్ తో పాన్ ఇండియాకి వెళుతున్నాడు. ఎంతమంది బాలీవుడ్ ఆఫర్స్ ఇచ్చినా విజయ్ దేవరకొండ మాత్రం సాహసం చెయ్యలేదు. 

కానీ బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ లో సరైన బ్లాక్ బస్టర్ లేకపోయినా హిందీలో ఎంట్రీ ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అది కూడా ఛత్రపతి రీమేక్ తో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే అల్లుడు అదుర్స్ హిట్ అవుతుంది.. ఆ క్రేజ్ తో హిందీలో సినిమా మొదలెడదామనుకున్న బెల్లకొండ కి అల్లుడు అదుర్స్ భారీ షాక్ ఇచ్చింది. అల్లుడు అదుర్స్ కి డిజాస్టర్ టాక్ రావడంతో బెల్లకొండ ఫాన్స్ ఇప్పుడు ఫీలవుతున్నారు. ఇక తన సినిమాలు హిందీ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ రావడంతో కాన్ఫిడెంట్ వచ్చి తనకి హిందీలో భారీ క్రేజ్ ఉంది.. అదే క్రేజ్ తో హిందీ ప్రేక్షకులు ఆదరిస్తారనుకుంటున్నాడు బెల్లంకొండ. అందుకే ఏం ఆలోచించకుండా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కానీ అల్లుడు అదుర్స్ టాక్ తో ఇప్పుడు హిందీకి వెళ్లడం అవసరమా అంటున్నారు నెటిజెన్స్.

Bollywood entry like this?:

Bellamkonda Sreenivas, who wanted to start a film in Hindi, was given a huge blow from Alludu Adhurs movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ