మెగా ఫ్యామిలీలో ఒక్క న్యూ ఇయర్ వేడుకలు తప్ప నిహారిక పెళ్లి వేడుకలు, అలాగే క్రిస్మస్ వేడుకలు ఏ రేంజ్ లో జరిగాయో మెగా ఫ్యామిలీ నుండి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ తోనే అర్ధమైంది. నిహారిక పెళ్లి వేడుకలు హైదరాబాద్ లోను, అలాగే రాజస్థాన్ లోను జరుపుకున్న అల్లు అర్జున్, రామ్ చరణ్ చిరు, పవన్ కళ్యాణ్, నాగబాబు ఫ్యామిలీలు క్రిస్మస్ వేడుకలని మాత్రం రామ్ చరణ్ - ఉపాసన హోస్ట్ లుగా జరిగాయి. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఏ రేంజ్ లో ప్లాన్ చేసేదో మెగా ఫ్యామిలీ.. కానీ రామ్ చరణ్, వరుణ్ తేజ్ లు కరోనా బారిన పడడంతో మెగా ఫ్యామిలీ మొత్తం న్యూ ఇయర్ వేడుకలకి దూరంగా ఉండిపోయింది.
కానీ ఈసారి సంక్రాంతి వేడుకలని మెగా ఫ్యామిలీ ఓ రేంజ్ లో ప్లాన్ చేసింది. భోగి రోజున భోగి మంటలతో మొదలు పెట్టిన సంక్రాంతి సెలెబ్రేషన్స్ కనుమ రోజు వరకు కొనసాగాయి. సంక్రాంతి రోజు అంటే గురువారం రాత్రి అయితే మెగా కాంపౌండ్ లో గానాభజానా అంటే మ్యూజికల్ నైట్ ని ఓ రేంజ్ లో నిర్వహించారు. అయితే ఈ మెగా మ్యూజికల్ నైట్ కి అక్కినేని నాగార్జున హాజరవడం విశేషం,. మెగా ఫ్యామిలిలో చిరు, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, కొత్తల్లుడు చైతన్య ఇలా అందరితో నాగ్ దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తుంది.