Advertisementt

అల్లుడు అదుర్స్.. రేసులో బెదుర్స్

Thu 14th Jan 2021 03:18 PM
bellamkonda srinivas,alludu adhurs movie,alludu adhurs movie review,alludu adhurs talk  అల్లుడు అదుర్స్.. రేసులో బెదుర్స్
Alludu Adhurs Movie Public talk అల్లుడు అదుర్స్.. రేసులో బెదుర్స్
Advertisement
Ads by CJ

బెల్లంకొండ హీరో శ్రీనివాస్ - నభ నటేష్ - అను ఇమాన్యువల్ కాంబోలో సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన అల్లుడు అదుర్స్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనూహ్యంగా సంక్రాంతి రేసులోకి వచ్చిన అల్లుడు అదుర్స్ ట్రైలర్ చూసిన వారు ఆ సినిమా ట్రైలర్ పై నెగెటివ్ కామెంట్స్ వేశారు. కానీ టీం మాత్రం మా సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ ప్రమోట్ చేసింది. సంక్రాంతికి ఫ్యామిలీ తో కలిసొచ్చి చూసే సినిమాగా పబ్లిసిటీ చేసింది. కానీ సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల స్పందన ఏమిటి అంటే సినిమాలో వెకిలి కామెడీ ఎక్కువగా అనిపిస్తుంది. అలాగే సక్సెస్ లేక చతికిల పడ్డ  అను ఇమ్మాన్యువల్  నటించడం, ఈ అల్లుడు అదుర్స్ చూసిన వారు ఈ సినిమాని నాలుగైదు సినిమాలను కలిపి మిక్సీలో వేసిన రుబ్బిన ఫీలింగ్ వస్తుంది అని అంటున్నారు.

పోస్టర్స్ తో హంగామా తప్ప సినిమా సాంగ్స్ లో కూడా పస లేదు. అల్లుడు అదుర్స్ లో బెల్లకొండ చేసిన కామెడీ చూసిన వారు అల్లరి నరేష్ ఇంట్లో దెయ్యం నాకేం భయం, అల్లుడు శీను సినిమాలు గుర్తుకు వస్తే.. నభ నటేష్ యాక్టింగ్, అండ్ లుక్స్ చూస్తే ఇస్మార్ట్ శంకర్ లో నభ లుక్స్ గుర్తుకు వచ్చాయని, ఇక సోను సూద్ కేరెక్టర్ చూసిన వారు సంతోష్ శ్రీనివాస్ కందిరీగలో సోను కేరెక్టర్ గుర్తుకు వస్తుంది అని అంటున్నారు. మరి ఇంత నెగెటివ్ టాక్ తెచ్చుకున్న అల్లుడు అదుర్స్.. మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ ముందు, తమిళనాట మాస్ హీరో విజయ్ సినిమా మాస్టర్ ముందు, రామ్ రెడ్ ముందు తేలిపోవడం ఖాయంగా కనబడుతుంది.

బెల్లంకొండ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే దీనితర్వాత మనోడు బాలీవుడ్ ఛత్రపతి రీమేక్ చెయ్యబోతున్నాడు. అల్లుడు అదుర్స్ హిట్ అయితే హుషారుగా ఆ సినిమా మొదలెడదామనుకున్నాడు. కానీ ఇప్పుడు అల్లుడు అదుర్స్ చూసిన వారు వామ్మో సంక్రాంతి రేసులో బెదుర్స్ అంటున్నారు.

Alludu Adhurs Movie Public talk:

Bellamkonda Alludu Adhurs Movie talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ