హీరోగా లాంచ్ అయినా సరైన హిట్ పడక స్ట్రగుల్ అవుతున్న అక్కినేని అఖిల్.. ఇప్పుడు గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ కనుసన్నల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చేస్తున్న విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో పూజ హెగ్డే హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక షెడ్యూల్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఇప్పటికే టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ కరోనా క్రైసిస్ లేకపోతె ఈపాటికే రిలీజ్ అవ్వాల్సిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తుంది. 100 % లవ్ తో నాగ చైతన్య కి మంచి హిట్ ఇచ్చిన గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే అఖిల్ కి కూడా మంచి హిట్ అందుకుంటాడనే నమ్మకం మొత్తం అక్కినేని కాంపౌండ్ లో కనిపిస్తుంది.
విశేషం ఏమిటంటే అల్లు అరవింద్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అఖిల్ కి మంచి హిట్ ఇచ్చి పంపించాలని పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే అల్లు అరవింద్ తన తనయుడు అల్లు అర్జున్ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మార్చేసిన ఆర్య సినిమా రిలీజ్ డేట్ మే 7th ని ఇప్పుడు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసారు. అంటే అఖిల్ - బొమ్మరిల్లు భాస్కర్ కాంబో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వేసవి కానుకగా మే 7 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి అల్లు అర్జున్ ని స్టార్ హీరోని చేసిన ఆ డేట్ అఖిల్ ఫెట్ మార్చబోతుందా? అఖిల్ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో తనలో ఉన్న క్వాలిటీస్ కి తగ్గ కరెక్ట్ రిజెల్ట్ తెచ్చుకుంటాడా..