అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అలా వైకుంఠపురం గత ఏడాది సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలా వైకుంఠపురములో విడుదలై ఏడాది అయిన సందర్భంగా అలా యూనిట్ మొత్తం రీ యూనియన్ బాష్ అంటూ హైదరాబాద్ లోని గీత ఆర్ట్స్ ఆఫీస్ లో పెద్ద హంగామా చేసిన విషయం తెలిసిందే. అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ ని పదే పదే గుర్తు చేస్తున్న బన్నీ గత రాత్రి జరిగిన రీ యూనియన్ బాష్ లో తెగ స్పీచ్ ఇచ్చేసాడు. అదేమిటంటే పవన్ కళ్యాణ్ గారికి ఏడో సినిమా ఖుషి తో ఇండస్ట్రీ హిట్ వచ్చింది. అలాగే ఎన్టీఆర్ కి ఏడో సినిమా సింహాద్రి తో ఇండస్ట్రీ వచ్చింది. అలాగే రామ్ చరణ్ రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టేసాడు. నాకు ఈ ఇండస్ట్రీ కొట్టడానికి 20 సినిమాలు పట్టింది.
అందుకే ఈ అలా వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం నాకు వెరీ వెరీ స్పెషల్ అంటూ బన్నీ తాను ఇండస్ట్రీ హిట్ కొట్టాననే విషయాన్నీ పదే పదే చెప్పుకుంటూ, నొక్కి ఒక్కాణించుకుంటూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేసాడు. అయితే ఈ సందర్భంగా ఇండస్ట్రీ హిట్స్ అంటూ బన్నీ తెలిపిన ఖుషి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. కాదని అనరెవ్వరు. కానీ అప్పటికీ నరసింహనాయుడే ఇండస్ట్రీ హిట్. సింహాద్రి సెన్సేషనల్ హిట్. కాదని చెప్పరెవ్వరు. కానీ 52 సెంటర్స్ లో 175 డేస్ ఆడిన లాంగ్ రన్ రికార్డ్ తప్ప అది కూడా ఇండస్ట్రీ హిట్ కాదనే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఆ రెండు సినిమాలను ప్రత్యేకించి ప్రస్తావించిన బన్నీ జన్యూన్ ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తావన తేకపోవడం గమనార్హం.
పోకిరి, శ్రీమంతుడు సినిమాలతో రెండు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన మహేష్ ప్రస్తావన తీసుకురాలేదు బన్నీ. మరి గత సంవత్సరం సంక్రాంతికి పోటీకి వచ్చిన మహేష్ ని ఇప్పటికి ప్రత్యర్థిగానే పరిగణిస్తున్నాడా బన్నీ.