జాన్ 14 సంక్రాంతి రోజున ప్రభాస్ రాధే శ్యాం డ్రీమ్స్ వదులుతున్నారు. అదే సంక్రాంతి సాయంత్రం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టీజర్ వదులుతున్నారు. మార్నింగ్ రాధేశ్యాం - ఈవినింగ్ వకీల్ సాబ్ టీజర్. మరి ప్రభాస్ ఫాన్స్, పవన్ కళ్యాణ్ ఫాన్స్ తమ పవర్ చూపించడానికి రెడీ అవుతున్నారు. ఎవరి ఫాన్స్ వాళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. యూట్యూబ్ లో కానీ, ట్విట్టర్ లో కానీ రికార్డ్స్, వ్యూస్, భారీ లైక్స్ కేట్టేయ్యాలనే ఉత్సాహంతో ఊగిపోతున్నారు. పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్న ప్రభాస్ అందరిని ఎట్రాక్ట్ చేసి ఆ రికార్డులని కొడతాడా.. పాన్ ఇండియా లెవెల్ రేంజ్ ఉన్న ప్రభాస్ ఫాన్స్ ఈ రేసులో గెలుస్తారా..
లేదంటే చాలా రోజుల్ తర్వాత సినిమాల్లోకి కం బ్యాక్ ఇస్తూ.. కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఈ రేసులో అప్పర్ హ్యాండ్ చూపిస్తాడా అనేది ఇప్పుడు ఇద్దరి ఫాన్స్ మదిలో ఆసక్తిగా కాదు.. ఆతృతగా మెదులుతున్న ప్రశ్న. ప్రస్తుతం పాన్ ఇండియా ఫిలిమ్స్ తో దూసుకుపోతున్న ప్రభాస్ ఫాన్స్ కి, వరసగా సినిమాలు ఒప్పుకుంటూ క్రేజ్ తో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఇప్పుడు డైరెక్ట్ సోషల్ మీడియా వార్ స్టార్ట్ కాబోతుంది. ఎప్పుడెప్పుడు మా హీరో ని ఓ రేంజ్ లో చూపిద్దామా అని ఎదురు చూసే ఫాన్స్ కి ఏ జనవరి 14 న సోషల్ మీడియాలో మహా సంగ్రామమే. మరి ఈ ఫైట్ లో ఏ ఫాన్స్ నెగ్గుతారో చూడాలి.