ఈమాటన్నది ఎవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్. రజినీకాంత్ ఆరోగ్య రీత్యా చెన్నైలోని ఆయన నివాసంలోనే రెస్ట్ తీసుకుంటున్నారు. గత నెలలో రజినీకాంత్ హైబీపీతో బాధపడడంతో ఆయన హాస్పిటల్ పాలయ్యారు. తర్వాత రజిని చెన్నై వెళ్లి ఆయన నివాసంలోనే రెస్ట్ లో ఉన్నారు. అయితే గత నెలలో రాజకీయాలంటూ అందరిలో ఆసక్తి కలిగించిన రజినీకాంత్ కి ఆరోగ్య సమస్యలు ఎదురు కావడం, కుటుంబ ఒత్తిడితో రజినీకాంత్ రాజకీయాలకు శుభం కార్డు వేశారు. లేదంటే తమిళనాట రజిని రాజకీయపార్టీ పై చర్చలు, మిగతా రాజకీయ నాయకులకు ముచ్చెమటలు పట్టేవి.
అయితే రజినీకాంత్ రాజకీయాలకు బై బై అంటున్నా ఆయన అభిమానులు మాత్రం ససేమిరా కుదరదు మీరు రాజకీయాల్లోకి దిగాల్సిందే అంటూ పట్టుబడితే ఓకె.. ఏకంగా ఆందోళన పర్వాన్ని స్టార్ట్ చేసారు. మీరేలాగైనా రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన నివాసం ముందే ఆందోళనలు చేపట్టారు. దానితో రజినీకాంత్ కూల్ గావాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ట్విట్టర్ లో ఆయన ఓ లేఖని వదిలారు. ప్లీజ్ నన్ను అర్ధం చేసుకోండి.. నేను ఎప్పటికి రాజకీయాల్లోకి రాలేను.. అంటూ ఓ లేఖని విడుదల చేసారు. మరి రజిని అంతగా అభిమానులని వేడుకుంటూ.. నన్ను వదిలెయ్యండి అంటున్నా రజినీకాంత్ అభిమానులు మాత్రం ఆగడం లేదు. వచ్చి తీరాల్సిందే అంటూ హంగామా చెయ్యడమే కాదు రచ్చ రచ్చ చేస్తున్నారు.