Advertisementt

మోనాల్ ఏడుపు - వీళ్ళకి కామెడీ

Mon 11th Jan 2021 03:04 PM
anil ravipudi,alludu adhurs movie,director anil ravipudi,monal gajjar,comments,monal gajjar photos,monal emotional heroine,monal  మోనాల్ ఏడుపు - వీళ్ళకి కామెడీ
Monal crying - comedy for them మోనాల్ ఏడుపు - వీళ్ళకి కామెడీ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ కి వెళ్లక ముందు అల్లరి నరేష్ సినిమాల్లో నటించిన మోనాల్ గజ్జర్ అంటే ఎవరికీ పెద్దగా తెలియని గుజరాతీ అమ్మాయి. కానీ బిగ్ బాస్ తో మోనాల్ ఫెట్ మారిపోయింది. బిగ్ బాస్ లో వరద గోదారిలా ఏడుపు స్టార్ట్ చేసే మోనాల్ చీటికి మాటికీ అలా ఏడవడంతో ఒకొనొక సమయంలో మోనాల్ ని బుల్లితెర ప్రేక్షకులు అమ్మో మోనాల్ ఎందుకిలా ఏడుస్తుంది. మాటిమాటికి  ఏడ్చే మోనాల్ ని ఎప్పుడెప్పుడు బయటికి పంపేద్దామా అని చూసారు. చిన్న విషయానికి పెద్ద విషయానికి ఏడుపుతో సింపతీ క్రియేట్ చేసుకున్న మోనాల్ బిగ్ బాస్ హౌస్ బయటకొచ్చాక కూడా అదే ఏడుపు కంటిన్యూ చేస్తుంది.  తనకి ఐటెం సాంగ్ ఆఫర్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సెట్స్ లో కూడా మోనాల్ ఏడ్చింది. కారణం ఆమె అల్లుడు అదుర్స్ సెట్స్ లొకి వెళ్లిన రోజు ఆమె తండ్రి చనిపోయిన రోజు ఒక్కటే కావడమట.

ఇక మోనాల్ ఏడుపు ని కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెడీగా అనిపించిందేమో. అల్లుడు అదుర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మోనాల్ గజ్జర్ చాలా డెడికేషన్ ఉన్నఅమ్మాయి, చాలా కష్టపడుతుంది. మోనాల్ గురించి రెండు మాట‌లు అయితే చెప్పొచ్చు.. కానీ మూడో మాట చెబితే తను ఏడుస్తుందేమోన‌ని అనిల్ రావిపూడి చెప్పడం చూస్తే మోనాల్ ఎంత ఎమోషనల్ అమ్మాయో అర్ధమవుతుంది. కొన్నిసార్లు మోనాల్ ఏడుపు చాలా కామెడిగా తీసుకునే బుల్లితెర ప్రేక్షకులు ఇప్పుడు అనిల్ మాటలని అంతే కామెడీగా తీసుకుంటున్నారు వాళ్ళు. అన్నట్టు మోనాల్ కి నర్మదా అనే పేరు కూడా పెట్టేసారు మన నాగ్.

Monal crying - comedy for them:

Anil ravipudi comments on Monal gajjar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ