Advertisementt

కొరకరాని కొయ్యగా అల్లుడు నిర్ణయం

Mon 11th Jan 2021 12:24 PM
bellamkonda srinivas,ram,red movie,alludu adhurs,preponed,january 14th,shock,red team  కొరకరాని కొయ్యగా అల్లుడు నిర్ణయం
Alludu Adhurs gives a shock to Red movie కొరకరాని కొయ్యగా అల్లుడు నిర్ణయం
Advertisement
Ads by CJ

అసలే థియేటర్స్ 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ.. అందులోని సంక్రాంతి జోరు.. అసలే పోటీ, అందులోను కొట్లాట అంటే ఎలా. ఇప్పుడు టాలీవుడ్  లో అదే కనబడుతుంది. జనవరి 9 న కూల్ గా థియేటర్స్ లోకి దిగుదామనుకున్న రవితేజ క్రాక్ కి ఫైనాన్స్ ప్రోబ్లెంస్ తో దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. ఆఖరికి ఎట్లాగో సాయంత్రానికి థియేటర్స్ లోకి దిగి మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక కోలీవుడ్ నుండి క్రేజీ మూవీ మాస్టర్ జనవరి 13 భోగి రోజునిఖాయం చేసుకుంది. ఆది ఓకె రామ్ రెడ్ జనవరి 14 న సంక్రాంతి అంటే పెద్ద పండగను ఖాయం చేసుకుని ప్రమోషన్స్ చేసుకుంటుంది. ఇక అనూహ్యంగా అల్లుడు అదుర్స్ సంక్రాంతి రేస్ అంటూ జనవరి 15 న విడుదల అంటూ అల్లుడు అదుర్స్ బ్యాచ్ హంగామా మొదలు పెట్టింది.

సరే ఓకె జనవరి 15 కదా 14 న మనకి బోలెడన్ని థియేటర్స్ దొరుకుతాయని రెడ్ టీం అనుకుంటే.. ఇప్పుడు అల్లుడు అదుర్స్ మళ్ళీ రెడ్ టీం కి ఝలక్ ఇచ్చింది. అదే ఒక రోజు ముందే అంటే రెడ్ కి పోటీగా దిగుతున్నామంటూ అల్లుడు అదుర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రెడ్ టీం కి షాకిచ్చింది. జనవరి 15 కాదు.. ఒకరోజు ముందుగా జనవరి 14 నే వచ్చేస్తున్నాం అంటూ హడావిడి మొదలు పెట్టింది. దానితో రెడ్ హీరో రామ్ షాకయ్యాడు. థియేటర్స్ లాక్ చేసుకుని కూర్చున్నాక ఇప్పుడు ఇలా పోటీకి వస్తే అర్ధం ఏమిటి అంటున్నాడట. మరి ముందు 15 అని.. మళ్ళీ కాదు మీకు పోటీ మేమె అంటే ఎలా కుదురుంది.. అంటూ రెడ్ టీం అల్లుడు అదుర్స్ టీం పై విరుచుకుపడుతుందట. అసలే థియేటర్స్ కి ప్రేక్షకులు సగం మందే వస్తున్నారు. మళ్ళీ మధ్యలో ఈ థియేటర్ పంపకాలేమిటి అంటూ రెడ్ టీం తలపట్టుకుంటుందట. మరి ఈ అల్లుడు - రెడ్ పంచాయితీ ఎక్కడ ఆగుతుందో చూడాలి.

Alludu Adhurs gives a shock to Red movie:

Bellamkonda Srinivas Alludu Adhurs preponed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ