Advertisementt

ఎన్టీఆర్ సినిమాకి త్రివిక్రమ్ మార్క్ టైటిల్ కాదే..!

Mon 11th Jan 2021 11:23 AM
trivikram,ntr,trivikram - ntr combo,jan 14th opening,title,choudappa naidu  ఎన్టీఆర్ సినిమాకి త్రివిక్రమ్ మార్క్ టైటిల్ కాదే..!
Trivikram Mark is not the title for NTR movie ..! ఎన్టీఆర్ సినిమాకి త్రివిక్రమ్ మార్క్ టైటిల్ కాదే..!
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబో మూవీ సంక్రాంతి రోజున అంటే జనవరి 14 న పూజ కార్యక్రమాలతో మొదలు కాబోతుంది. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో అరవింద సమేత హిట్ అవడంతో అందులోను త్రివిక్రమ్ అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ అవడం, ఎన్టీఆర్ RRR తో పాన్ ఇండియా లెవల్ మూవీ చెయ్యడంతో ఇప్పుడు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో పై ట్రేడ్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. అయితే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో మూవీ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ గా రాజకీయాలను టచ్ చేయబోతున్నట్లుగా ప్రచారంలో ఉన్న న్యూస్. అయితే ఈ సినిమాకి టైటిల్ గా చౌడప్ప నాయుడు అనే టైటిల్ పెట్టబోతున్నట్టుగా సోషల్ మీడియా టాక్. త్రివిక్రమ్ మర్క్స్ టైటిల్స్ మనసును హత్తుకునేలా.. కామెడీగా, ఎంటర్టైనింగ్ గా ఉంటాయి.

ఓ ఖలేజా, ఓ జులాయి, ఓ ఖల్సా, అత్తారింటికి దారేది లాంటివి అన్నమాట. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కి పెట్టబోయే ఈ చౌడప్ప నాయుడు టైటిల్ చూస్తే త్రివిక్రమ్ మార్క్ టైటిల్ లా అనిపించడం లేదు. అంటే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ కామెడీ ఎంటర్టైనర్ కాకుండా మాస్ మసాలా మూవీ ఎమన్నా చేయబోతున్నాడా అని ఎన్టీఆర్ ఫాన్స్ లో అనుమానం మొదలయ్యింది. నాయుడు టైటిల్ అంటే మాస్ గానే ఉంది. అందులో ఎంటర్టైన్మెంట్ లేదు. అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ తెగ ఇదైపోతున్నారు. మరి గతంలో అయినను పోయిరావలె హస్తినకు టైటిల్ పెట్టినట్టుగా వార్తలొచ్చినా ఇప్పుడు ఈ చౌడప్ప నాయుడు టైటిల్ అయితే ప్రచారంలోకొచ్చింది. మార్చ్ నుండి రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతున్న ఎన్టీఆర్ మూవీ ఓపెనింగ్ రోజున టైటిల్ అనౌన్సమెంట్ ఎమన్నా ఉంటుందేమో చూడాలి.

Trivikram Mark is not the title for NTR movie ..!:

Jr NTR and Trivikram Srinivas film titled Choudappa Naidu?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ