Advertisementt

లవ్ స్టోరీ తో మరోసారి ఫిదానే..

Sun 10th Jan 2021 01:11 PM
naga chaitanya,sai pallavi,love story movie,sekhar khammula,love story teaser release,love story,love story review,love story review rating  లవ్ స్టోరీ తో మరోసారి ఫిదానే..
Love Story Teaser Review లవ్ స్టోరీ తో మరోసారి ఫిదానే..
Advertisement
Ads by CJ

శేఖర్ కమ్ముల మూవీస్ అన్నీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్. మనసును హత్తుకునే ప్రేమ కథలు. ఎమోషనల్ గా టచ్ అయ్యే సన్నివేశాలు. ఇప్పుడు కూడా మరో లవ్ స్టోరీ. అదే నాగ చైతన్య - సాయి పల్లవిల రేవంత్ - మౌని ల ప్రేమ కథ. లవ్ స్టోరీ షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ లో భాగంగా పబ్లిసిటీని మొదలు పెట్టింది టీం. అందులో భాగంగా లవ్ స్టోరీ టీజర్ ని విడుదల చేసింది. నాగ చైతన్య రేవంత్ పాత్రలో బాగా కష్టపడే కుర్రాడు, సాయి పల్లవి మౌనిక పాత్రలో సాఫ్ట్ వెర్ జాబ్ చేసే అమ్మాయి. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలయ్యింది అనేదే లవ్ స్టోరీ మెయిన్ థీమ్.

రేవంత్ గా నాగ చైతన్య లుక్స్ సూపర్బ్, మౌనిక గా సాయి పల్లవి మిడిల్ క్లాస్ ఆలోచనలు, లుక్స్ అన్ని అదరగొట్టేశాయి. వీరి మధ్యన రొమాన్స్, ప్రేమ, ఎమోషన్ అన్ని హైలెట్ అనేలా ఉన్నాయి. ఏం చేస్త‌వ్ ఆ సాఫ్ట్ వేర్ జాబ్ లో.. క‌ళ్ల‌ద్దాలొస్త‌యి.. బ్యాక్ పెయినొస్త‌ది, జుట్టంతా ఊష్ పోతది.. జరా ఆలోచించు అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంటే.. సాయి పల్లవి ఏంద్రా ఒదిలేస్త‌వ న‌న్నూ అంటూ చైతు ని అడగడంతో చైతు ఇచ్చిది ఎక్సప్రెషన్ చాలా క్యూట్ గా ఎమోషనల్ గా టచ్ చేస్తుంది. తెలంగాణ యాసతో శేఖర్ కమ్ముల మరోసారి లవ్ స్టోరీతో ఫిదా అనిపించేలా కనిపిస్తున్నాడు.

Love Story Teaser Review:

Naga Chaitanya - Sai Pallavi Love Story teaser release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ