నాగ చైతన్య - విక్రమ్ కె కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో ఒక హీరోయిన్ గా చిన్నారి పెళ్లి కూతురు ఫిక్స్ అవడమే కాదు.. అప్పుడే షూటింగ్ కూడా మొదలు పెట్టేసింది. ఇక రెండో హీరోయిన్ గా నాగ చైతన్య భార్య, హాట్ హీరోయిన్ సమంత నటించబోతుంది. ఈ విషయమై చిత్రం బృందం నుండి ప్రకటన రావాల్సి ఉండగా.. ఇప్పుడు మూడో హీరోయిన్ ముచ్చట సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది. నాగ చైతన్య సరసన ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్న ఈ సినిమాలో చైతు సరసన మూడో హీరోయిన్ గా టాలీవుడ్ లక్కీ గర్ల్ నటించబోతున్నట్టుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఆమె ఎవరో కాదు రష్మిక మందన్న, ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళం అంటూ ఆయా భాషల సినిమా షూటింగ్స్ కోసం కోసం ఎక్కే ఫ్లైట్ ఎక్కి దిగే ఫ్లైట్ దిగుతున్న రష్మిక చైతు సరసన మూడో భామగా మారనుందట. క్రేజీ హీరోయిన్స్ నే తీసుకోవాలని చైతు - విక్రమ్ కుమార్ లు ఫిక్స్ అవడంతో ప్రస్తుతం ఫామ్ లోకొచ్చిన అవికా గోర్ అలాగే నాగ చైతన్య భార్య సమంతని ఇప్పుడు రష్మికాని ఎంపిక చేసుకున్నారని.. ఇక తాను ఇతర సినిమాల్తో ఎంత బిజీగా ఉన్నా.. చైతూ సినిమాకి డేట్స్ కూడా తక్కువ కావడం, పాత్రలో ప్రాధాన్యత ఉండడంతో రష్మిక ఈ ఆఫర్ ని పట్టేసుకుందనే టాక్ నడుస్తుంది.