నాగుబాబు ఇప్పుడు రెండికి చెడ్డ రేవడిలా తయారయ్యాడు. మెగా బ్రదర్ గా ఒకప్పుడు ఆయనకు గౌరవం ఇచ్చినవారే.. ఇప్పుడు పక్కనుంచి పోతున్నారు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో.. ఎప్పుడు ఏం తవ్వుతాడో నాగబాబుకు తెలియదు. వెండితెర మీద కేరెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన నాగబాబు బుల్లితెర మీద చాలా షోస్ కి జేడ్జ్ గా వ్యవహరించి తాజాగా యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్నాడు. ప్రస్తుతం నాగబాబుకు ఉన్న ఏకైన ఛానల్ అదొక్కటే. ఎందుకంటే బంగారం లాంటి జబర్దస్త్ ని వదులుకున్న నాగబాబు అదిరింది అంటూ ఏదో అదరగొడదామనుకుని సైలెంట్ గా కూర్చున్నాడు
జబర్దస్త్ అలా.. మల్లెమాల ఇలా అంటూ నాగబాబు మాట్లాడిన మాటలు అన్నీ ఇన్నీ కావు. జబర్దస్త్ నుండి పోతూ పోతూ నాగబాబు మల్లెమాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసాడు. జబర్దస్త్ ని ఒణికిద్దామనుకుని అదిరింది స్టార్ చేసి బెదరగొడదామనుకున్నా జబర్దస్త్ తొణకలేదు బెణకలేదు. ఆఖరికి అదిరింది బెదిరి షో ప్యాకప్ చెప్పేసింది. మరి నాగబాబుకి అటు జబర్దస్త్ పోయే.. ఇటు అదిరింది లేకపాయె. ప్రస్తుతం ఖాళీగా ఉన్న నాగబాబు కి జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఉన్నట్లుగా.. ఆ రకమైన ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లుగా ఫిలిం నగర్ టాక్. కానీ మల్లెమాల మాత్రం నాగుబాబు రీ ఎంట్రీ కి ఒప్పుకోవడం లేదట.
రోజా ఉన్నా చాలు.. ఇక నాగబాబు అవసరం లేదు. రోజా చాలా చక్కగా జబర్దస్త్ ని హ్యాండిల్ చేస్తుంది. మరో జేడ్జ్ గా మనో గారు మాకు సరిపోతారు. అందుకని మీ రాక మాకవసరం లేదంటూ నాగబాబుకు మల్లెమామల వాళ్ళు నో ఎంట్రీ బోర్డు పెట్టినట్లుగా సోషల్ మీడియా టాక్.