ప్రేమకు మరణం లేదు.. ప్రేమ డైలాగ్ సినిమాల్లోనే బాగుంటాయి.. కానీ బయట మాత్రం మరోలా ఉంటుంది.. పరిస్థితి. ప్రేమ సినిమాల్లో చూపించినంత గొప్పగా ఏమి రియల్ లైఫ్ లో ఉండదు. గతంలో ఏమో గాని.. ఈ మధ్య కాలంలో అయితే.. ప్రేమ అన్నది పక్కా కమర్షియల్ ఐటెం లా మారింది. అన్ని లెక్కలేసుకునే ప్రేమలో పడిన సందర్భాలు కోకొల్లలు ? ఇప్పుడు ఈ ఉపోద్గాతం అంతా ఎందుకంటే .. రియల్ లైఫ్ లో డీప్ లవ్ లో ఉన్న ఓ అమ్మాయి.. తన ప్రియుడు చనిపోయి ఏడాది అయినా కాకుముందే మరో లవర్ ని పట్టేసిన సందర్బంగా వచ్చింది కాబట్టి ఇదంతా !
అతనకుముందే .. నువ్వే నా సర్వస్వము.. నువ్వే నా ప్రాణం అని తిరిగిన ఆ అమ్మాయి.. ఇప్పుడు మరో బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్న ఫోటోలు ట్రేండింగ్ అవుతున్నాయి.. ఇదంతా జరుగుతున్నది బాలీవుడ్ లో ? ఇంతకీ ఎవరా అమ్మాయి ఏమా కథ అంటే.. బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి అందరికి తెలుసు.. ముక్యంగా ఎం ఎస్ ధోని సినిమాతో అందరికి బాగా పరిచయం అయినా ఈ హీరో అనుకోని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం రేపింది. ఈ కేసు గురించి పోలీసులు ఆరా తీయడంతో అతని గర్ల్ ఫ్రెండ్ రియా అని తేలింది .. ఆ తరువాత డ్రగ్స్ వ్యవహారం బయటికి వచ్చిందనుకోండి .. అది వేరే విషయం. సుశాంత్ తో డీప్ లవ్ లో ఉన్న ఈ అమ్మడు సుశాంత్ మరణంతో చాలా బాధలోకి వెళ్ళిపోయినట్టు కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం మరో వ్యక్తితో డీప్ గా ఉన్న ఫోటోని షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది ?
దానికి తోడు.. మై గర్ల్ అనే క్యాప్షన్ కూడా పెట్టి మరి ఆ ఫోటోను షేర్ చేసింది. డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లిన రియా.. అనారోగ్య కారణాలు చెప్పి బెయిల్ పై బయటికి వచ్చింది .. చాలా రోజులతరువాత బయటికి వచ్చిన ఆమె రావడంతోనే ఇలా బాయ్ ఫ్రెండ్ తో షాక్ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవ్వడమే కాదు.. రియా పై నెటిజన్స్ ఘాటు కామెంట్స్ పెడుతూ.. రకరకాలుగా ఆడుకుంటున్నారు ?