Advertisementt

రామ్ చరణ్ రాకింగ్ ప్రాజెక్ట్.!

Fri 08th Jan 2021 05:20 PM
ram charan,ram charan new movie,rrr,next project,lokesh kanagaraj,master,khaidhi,vikram,kamal haasan,lokesh kanakaraj - ram charan combo,charan - kanakaraj movie  రామ్ చరణ్ రాకింగ్ ప్రాజెక్ట్.!
Ram Charan rocking project రామ్ చరణ్ రాకింగ్ ప్రాజెక్ట్.!
Advertisement
Ads by CJ

కార్తీ తో ఖైదీ సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనకరాజ్ ఇమ్మిడియట్ గా తమిళ స్టార్ హీరో  విజయ్ తో మాస్టర్ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. అంతే శరవేగంగా షూటింగ్ కూడా కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేసి పక్కనబెట్టేసాడు. ఆ వెంటనే క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా కమల్ హాసన్ తో విక్రమ్ అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి.. ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్ళిపోయాడు. మోస్ట్ హాపినింగ్  డైరెక్టర్, క్రేజియస్ట్  డైరెక్టర్ గా అనిపించుకుంటున్న లోకేష్ కనకరాజ్ రీసెంట్ గా రామ్ చరణ్ ని కలిశానని చరణ్ తో సబ్జెక్టు కూడా డిస్కర్స్ చేసానని చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన మాస్టర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అది నిజమనే విషయం కన్ఫర్మ్ అయ్యింది. భాగ్యరాజ్ కొడుకు శంతన్ భాగ్య రాజ్ మాస్టర్ ఈవెంట్ లో మట్లాడుతూ.. దర్శకుడు లోకేష్ కనకరాజ్ త్వరలోనే ఓ తెలుగు సినిమా చేయబోతున్నాను నువ్వు తెలుగు నేర్చుకో అని నన్ను ఆదేశించారు. నేను ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాను. త్వరలోనే ఓ పెద్ద తెలుగు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులముందుకు వస్తానని ప్రకటించడంతో.. ఇది లోకేష్ కనకరాజ్ - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమానే అనడానికి ఆధారం  దొరికింది. దీనిని బట్టి రామ్ చరణ్ - లోకేష్ కనకరాజ్ కాంబో పక్కా అని మెగా ఫాన్స్ ఫిక్స్ అవుతున్నారు. 

Ram Charan rocking project :

Ram charan - lokesh kanagaraj movie on cards

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ