కరోనా క్రైసిస్ ని అధిగమించి హీరోలంతా సినిమాల రిలీజ్ ల కోసం కాచుకుని కూర్చోవడమే కాదు.. షూటింగ్ ఫినిష్ అయిన సినిమాలన్నీ కేంద్ర మార్గ దర్శకాలతో 50 పర్సెంట్ సీటింగ్ తో బరిలోకి దిగుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం 100 శాతం సీటింగ్ కి పర్మిషన్ ఇవ్వడంతో తెలుగు హీరోల్లోనూ ఆశలు చిగురించాయి. తెలుగు ప్రభుత్వాల అనుమతుల కోసం ట్రై చేసే లోపు తమినాడు ప్రభుత్వం ఇచ్చిన 100 శాతం ఆక్యుపెన్సీ జీవో ని వెనక్కి తీసుకునేలా చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి గత నెల 25 న విడుదలయిన సోలో బ్రతుకే సో బెటర్ 50 శాతం సీటింగ్ తో సో సో గా నడిచింది. రేపు ప్రేక్షకుల ముందుకురాబోతున్న రవితేజ క్రాక్ కూడా 50 శాతం అక్యుపెన్సీతోనే థియేటర్స్ లోకి దిగుతుంది.
అయితే మాస్ మహారాజ్ రవితేజ, క్రాక్ టీం మాత్రం సినిమా మాస్ ప్రేక్షకులకు ఎక్కుతుంది, సంక్రాంతికి ఆదిరిపోయే మాస్ ఎంటర్టైనర్ క్రాక్, మాస్ ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్స్ కి రప్పిస్తుంది అంటూ ఊదరగొడుతున్నారు. మాస్ రాజా నటించిన క్రాక్ సినిమా కి ప్రేక్షకాదరణ ఎంత ఉందొ అనేది బుక్ మై షో లో తెగుతున్న టికెట్స్ చూస్తే తెలుస్తుంది. సంక్రాంతి బరిలో ముందుగా దిగుతున్న మాస్ మహారాజ్ క్రాక్ సినిమా కి బుక్ మై షో లో అంతగా రెస్పాన్స్ లేదు. అంటే బుకింగ్స్ చాలా వీక్ గా కనబడుతున్నాయి. ఒక్క మహేష్ ఏఎంబి తప్ప క్రాక్ సినిమా 50 శాతం కూడా ఫుల్ అవలేదు. ఆసలే 50 శాతం సీటింగ్స్. అవి కూడా ఫుల్ అవ్వకపోతే కష్టమే. మరి ప్రేక్షకులు కరోనా టైం ఇప్పుడు సినిమాలు అవసరమా అనుకుంటున్నారా..లేదంటే వరస ప్లాప్స్ తో ఉన్న రవితేజ సినిమాని థియేటర్స్ కి వెళ్లి చూడాలా అనుకుంటున్నారా.. అనేది అర్ధం కావడం లేదు.