అన్ని అనుకున్నట్టుగా జరిగితే క్రేజీ పాన్ ఇండియా ఫిలిం ఆర్. ఆర్. ఆర్ ఈపాటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసేది. రాజమౌళి - తారక్ - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్. ఆర్. ఆర్ విడుదల జనవరి 8 2021 అని ప్రకటించినప్పుడు చరణ్, ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి ఫాన్స్ చాలా హ్యాపీ గా ఫీలయ్యారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్నారంటే ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయి.. అభిమానుల హడావిడి ఎలా ఉంటుంది. అదే థియేటర్స్ దగ్గర కనబడేది. బ్యానెర్లు కట్టడం, హీరోలకి పాలాభిషేకాలు చెయ్యడం.. అమ్మో ఆర్. ఆర్. ఆర్ థియేటర్స్ దగ్గర అభిమానుల సందడి ఊహించుకోవడానికే గూస్ బాంబ్స్ వచ్చేస్తున్నాయి.
కానీ నేడు థియేటర్స్ దగ్గర సందడి లేదు. ఆర్ ఆర్ ఆర్ రాక ఆలస్యమైంది. కరోనా అందరి ఆశల మీద నీళ్లు చల్లింది. అనుకున్న టైం కి ఆర్. ఆర్. ఆర్ ఆగమనం లేకుండా పోయింది. లేదంటే ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ ఈపాటికి థియేటర్స్ దగ్గర రచ్చ రచ్చ చేసేవారే. మరి కొమరం భీం, అల్లూరి రామరాజు టీజర్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసిన రాజమౌళి.. సినిమా విడుదలకి క్రేజీ డేట్ ఎప్పుడు ప్రకటిస్తాడో అని ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి ఈ రోజు ఈ పాటికి ఫాన్స్ మాత్రమేనా రాజమౌళి సినిమాలను అభిమానించే ప్రేక్షకులు, సినిమా లవర్స్ అందరూ థియేటర్స్ ముందు బారులు తీరేవారు. భారీ మల్టీస్టారర్, క్రేజీ మూవీ కి బుక్ మై షో లో టికెట్స్ దొరక్క బాక్సాఫీసు వద్ద వార్ జరిగేది. కానీ ఏం చేస్తాం అన్ని అనుకున్నట్టుగా జరిగితే మనమెందుకు అన్నట్టు.. ఆర్ ఆర్ ఆర్ మరో విడుదల తేదీపై వేచి చూడడం తప్ప చేసేదేం లేదు. మరి షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ దసరా కి విడుదలయ్యే ఛాన్స్ ఉందని.. రాజమౌళి పక్కా ప్లాన్ తో విడుదల డేట్ ఎనౌన్స్ చేస్తారని టాక్ అయితే ఉంది.