Advertisementt

త్రివిక్రమ్ మళ్లీ త్రీమచ్ చేస్తారా.?

Tue 05th Jan 2021 10:36 PM
trivikram,pooja hegde,ntr film,  త్రివిక్రమ్ మళ్లీ త్రీమచ్ చేస్తారా.?
Will Trivikram did Hat-trick film with this Heroine? త్రివిక్రమ్ మళ్లీ త్రీమచ్ చేస్తారా.?
Advertisement
Ads by CJ

మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ది ఒక ప్రత్యేకమైన పంధా. ఆయనకు బాగా కంఫర్టుబుల్ గా కన్వీనెంట్ గా సెట్ అయిన హీరోస్ తోనే త్రివిక్రమ్ ట్రావెల్ చేస్తుంటారు. ఇప్పటివరకు త్రివిక్రమ్ చేసిన సినిమాలు చూస్తే పవన్ కళ్యాణ్ తో మూడు సినిమాలు, అల్లు అర్జున్ తో మూడు సినిమాలు, మహేష్ బాబు తో రెండు సినిమాలు, ఎన్టీఆర్ తో ఇప్పుడు రెండో సినిమా. ఇలా ఆయన ఆ పర్టిక్యులర్ హీరోస్ తోనే ట్రావెలింగ్ కొనసాగించడం గమనార్హం. అంతేకాదు హీరోస్ విషయంలోనే కాదు హీరోయిన్స్ విషయంలోనూ త్రివిక్రమ్ ఇదే థీరీ ఫాలో అవుతుంటారు. 

ఆయనకు బాగా ఫైన్ ట్యూన్ అయిన హీరోయిన్ ని ఒక పట్టాన వదిలి పెట్టరు. దానికి నిదర్శనమే జల్సా, జులాయి రెండు సినిమాల్లోనూ కంటిన్యూస్ గా ఇలియానాని కొనసాగించారు. ఇక సమంత ని అయితే అస్సలు ఒదిలి పెట్టకుండా హ్యాట్రిక్ కొట్టి పంపించారు. కంటిన్యూస్ గా మూడు సినిమాలు. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ.. ఆ.. మూడు సినిమాలతో హ్యాట్రిక్ చేసి మరీ అప్పుడు కాని సమంత ని వదిలి పెట్టలేదు. లేటెస్ట్ గా త్రివిక్రమ్ కాంపౌండ్ లో ఆయన ఆఫీస్ లో తిష్ట వేసుకుని కూర్చున్న హీరోయిన్ పూజ హెగ్డే. అరవింద సమేత, అలా వైకుంఠపురములో కంటిన్యూస్ గా రెండు సినిమాల్లో మళ్ళీ కంటిన్యూ అయిన పూజ హెగ్డే.. సమంత లాగా మూడో సినిమా చేసే ఛాన్స్ కూడా దక్కించుకుని.. ఇప్పుడు ఎన్టీఆర్ తో చెయ్యబోయే సినిమాలో కూడా తానే హీరోయిన్ అవుతుందా? హ్యాట్రిక్ కొట్టేస్తుందా?

త్రివిక్రమ్ త్రీమచ్ చేస్తాడా.. అనేది అందరూ ఆశక్తిగా చూస్తున్న అంశం.. లెట్ సి..

Will Trivikram did Hat-trick film with this Heroine?:

Trivikram Votes To Pooja Hegde Once Again For NTR Movie 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ