Advertisementt

లేటెస్ట్ బజ్: పవన్ సరసన కైరా అద్వానీ

Tue 05th Jan 2021 07:00 PM
kiara advani,romance,pawan kalyan,harish shankar  లేటెస్ట్ బజ్: పవన్ సరసన కైరా అద్వానీ
Latest Buzz: Kiara to romance Pawan లేటెస్ట్ బజ్: పవన్ సరసన కైరా అద్వానీ
Advertisement
Ads by CJ

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ షూటింగ్ ని ఫినిష్ చేసి.. అయ్యప్పమ్ కోషియమ్ రీమేక్ కోసం తయారవుతున్నాడు. అయ్యప్పమ్ కోషియమ్ - క్రిష్ సినిమా పారలల్ గా చెయ్యబోతున్న పవన్ కళ్యాణ్ కి దర్శకుడు క్రిష్ కరోనా బారిన పడడంతో.. క్రిష్ సినిమా నుండి పవన్ కి బ్రేక్ వచ్చింది. ఇక క్రిష్ సినిమా, అయ్యప్పమ్ కోషియమ్ సినిమా షూటింగ్స్ ఓ కొలిక్కి రాగానే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో మరో క్రేజీ మూవీ కోసం రెడీ అవుతాడు. అయితే హరీష్ శంకర్ - పవన్ కాంబో మూవీలో నటించబోయే హీరోయిన్స్ విషయమై రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో జరిగాయి. హరీష్ శంకర్ లక్కీ హీరోయిన్  పూజ హెగ్డే పవన్ సరసన హీరోయిన్ అంటూ ప్రచారం జరిగినా..  హరీష్ శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ జోడిగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ కన్సల్ట్ చేస్తున్నారు మేకర్స్. 

ఈమేరకు కియారా అద్వానీ దగ్గరకు ప్రపోజల్ కూడా వెళ్లినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే హరీష్ శంకర్.. పవన్ పక్కన కియారా అద్వానీని ఫైనల్ చెయ్యబోతున్నాడు. ప్రస్తుతం హరీష్ కియారకే ఫిక్స్ అయినట్లుగా సమాచారం. మరి పవన్ ఫాన్స్ కి ఈ కాంబినేషన్ మంచి  ఫీస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తో కం బ్యాక్ ఇచ్చినా.. క్రిష్ సినిమా, హరీష్ శంకర్ సినిమా, సురేందర్ రెడ్డి సినిమా అంటూ మంచి సినిమాల లైనప్ , మంచి కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. ఇక పవన్ లుక్స్ విషయంలోనూ పవన్ తో చెయ్యబోయే దర్శకులు ప్రత్యేక శ్రద్ద తీసుకోబోతున్నారనే న్యూస్ కూడా పవన్ ఫాన్స్ కి కిక్కిస్తుంది.

Latest Buzz: Kiara to romance Pawan :

Buzz: Kiara Advani to romance Pawan Kalyan in Harish Shankar Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ