నిన్ననే తమిళనాడు ప్రభుత్వం 100 శాతం అక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చేసింది. తమిళనాడు మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచాలంటూ నిర్మాతల మండలి రెండు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం లను కలవబోతున్నారు. ఇప్పటికే నిర్మాతల మండలి ఓ ప్రెస్ నోట్ ని కూడా రిలీజ్ చేసింది. సంక్రాతి సినిమాల విడుదలను దృష్టిలో ఉంచుకుని.. నిర్మాతల మండలి ఈ మేరకు ముఖ్యమంత్రులను కలవబోతున్నారు. ఎవరికీ వారే వ్యక్తిగతమైన జాగ్రత్తలు పాటిస్తూ (మాస్క్ వేసుకోవడం, శానిటైజ్ చేసుకోవడం) సినిమాలు చూసేందుకు వెళతారని అందరూ భావిస్తున్నారు
అయితే తమిళనాడు ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీకి జీవో పాస్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే .. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ సీఎం లు కూడా థియేటర్స్ లో 100 శాతం సీటింగ్ సామర్థ్యం పెంచేందుకు సుముఖత వ్యక్తం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎవరికివారే వ్యక్తిగత రక్షణ చూసుకుంటున్నారు కాబట్టి. 100 శాతం సీటింగ్ ఖచ్చితంగా ఉంటుంది అంటూ సంక్రాంతి సినిమాలు క్రాక్, రెడ్, అల్లుడు అదుర్స్ 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ లో దుమ్ముదులిపెయ్యడానికి ఉత్సాహం రెడీ అవుతున్నాయి.