కరణ్ జోహార్ క్రియేషన్స్ స్టూడెంట్ అఫ్ ది ఇయర్ తో ఇంట్రడ్యూస్ అయిన అలియా భట్ ఎంత పెద్ద స్టార్ గా ఎదిగిందో.. స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2 తో ఇంట్రడ్యూస్ అయిన అనన్య పాండే కూడా అదే రేంజ్ లో స్టార్ అయ్యే దిశగా ఒడి ఒడిగ అడుగులు వేస్తుంది. అటు బాలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తూనే.. ఇటు మన పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో పాన్ ఇండియా మూవీ గా రాబోతున్న ఫైటర్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం చేజిక్కించుకుంది. ఎప్పుడూ సినిమాలకన్నా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే అనన్య పాండే అందాలు అభిమానులను కవ్విస్తూ కనువిందు చేస్తూనే ఉంటాయి. గ్లామర్ గా బికినీ షోస్ చేస్తూ.. అందాలను ఆరబోసే అనన్య పాండే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో భాగంగా మాల్దీవుల్లో బికినీ షోస్ తో చెలరేగిపోయింది.
అయితే అమ్మడు ఇంతటితో ఆగలేదు. రీసెంట్ గా మరో క్రేజీ ఆఫర్ అనన్య తలుపు తట్టింది. ఆదేమిటంటే.. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న మెగా ఫిలిం లో అనన్యకి ఆఫర్ దక్కింది అనేది తాజా సమాచారం. మెగా ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ కోసం ఓ పర్టిక్యులర్ కేరెక్టర్ కి, ఓ గ్లామరస్ హీరోయిన్ గా అనన్య పాండే అని అనుకుంటున్నారు. అనన్య పాండే నే ఫైనలైజ్ చేసే దిశగా డిస్కర్షన్స్ కూడా జరుగుతున్నాయి. మరి ఇదే నిజమైతే అనన్య పాండే అనే యూత్ ఫుల్ హీటర్ ఫైటర్ కన్నా ముందే టాలీవుడ్ లోకి ఎంటరైపోవడం ఖాయం.