Advertisementt

KGF 2 హంగామా షురూ గురూ.!

Wed 20th Jan 2021 09:04 PM
kgf chapter 2 teaser january 08 prashanth neel yash  KGF 2 హంగామా షురూ గురూ.!
KGF Hungama Start Guru.! KGF 2 హంగామా షురూ గురూ.!
Advertisement
Ads by CJ

అదిరిపోయే హీరో కేరెక్టరైజేషన్ తో అభిమానులు ఈలలు వేసి గోలలు చేసే అత్యద్భుతమైన హీరో ఎలివేషన్ సీన్స్ తో పాటు ఆసక్తికరమైన కథాకథనాలతో, అదరగొట్టే యాక్షన్ సన్నివేశలతో కెజిఎఫ్ సినిమాని రక్తికట్టించి.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 తో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నారా.. అంటే అవును అన్నట్టే ఉంది అతను రిలీజ్ చేసిన ఈ పోస్టర్. బాహుబలి తర్వాత అన్ని భారతీయ భాషా చిత్ర పరిశ్రమలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సీక్వెల్ కెజిఫ్ చాప్టర్ 2 ఎప్పుడెప్పుడు విడుదవుతుందా అని యశ్ అభిమానులే కాదు.. యావత్ భారతావని ఎదురు చూస్తుంది. కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ విడుదల చేసిన ఈ పోస్టర్ చూస్తే ఎన్నో అద్భుతాలు, ఎన్నెన్నో అనుమానాలు, ఎన్నెన్నో సస్పెన్స్ లు దాగి ఉన్నాయనిపిస్తుంది.

కెజిఎఫ్ టైమ్స్ అంటూ ఆ పోస్టర్ లో హీరోనా? విలనా? అనే టైటిల్ తో మంచి చేసే వాడు హీరో, చెడు చేసే వాడు విలన్, రెండు కలిపి చేసేవాడు హీరోనా? విలనా? అవధులు దాటి కలలు కంటున్నారు, కెజిఎఫ్ లో బంగారాన్ని కనుగొన్నప్పుడు పుట్టిన వ్యక్తి కెజిఎఫ్ కి రాజు అవుతాడా? అతని పాదం సైజు చిన్నదయినా అతను కాలు పెట్టిన మార్గం పెద్దది. స్వాతంత్య్రం వచ్చాక బొంబాయి హై ఎలెర్ట్ లో ఉంది. రాఖీ భాయ్ తన సామ్రాజ్యాన్ని విస్తరించడం? శక్తివంతమైన వ్యక్తులు శక్తివంతమైన ప్రదేశాల నుండి వస్తారు. బ్రాండ్ పుట్టిందే రాకీతో.. భువి నుండి దివికి ఎదగడం, తల్లి చెప్పినట్టుగా నువ్వు ఎలా బ్రతుకుతావో తెలియదు.. కానీ చచ్చిపోయేటప్పుడు పెద్ద రాజుగా గొప్ప శ్రీమతుడివై చచ్చిపోవాలి అన్నట్టుగా రాఖీ భాయ్ ఉంటాడా? అతనేనా రక్షకుడు.. ఇది ప్రశాంత్ నీల్ వదిలిన పోస్టర్ లో ఉన్న ఆసక్తికరమైన అనుమానాలు. ఇవన్నీ కెజిఎఫ్ చాప్టర్ 2 లో ప్రశాంత్ నీల్ రివీల్ చెయ్యబోతున్న అంశాలు.

మరి కెజిఎఫ్ చాప్టర్ 2 వచ్చేవరకు ఇలాంటి పోస్టర్ తోనే సరిపెట్టుకోవాలా.. అందుకే మధ్యమధ్యలో కెజిఎఫ్ హంగామాని షురూ చేసింది టీం. యశ్ పుట్టిన రోజు కానుకగా కెజిఎఫ్ టీజర్ ని జ‌న‌వ‌రి 8 ఉదయం 10 గంటల 18 నిమిషాలకు విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్రకటన విడుదల చేసింది కెజిఎఫ్ చిత్ర బృందం.

KGF Hungama Start Guru.!:

KGF Chapter 2 Teaser on January 08

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ