Advertisementt

SVP లో మహేష్ వదినగా రేణు దేశాయ్.?

Mon 04th Jan 2021 12:23 PM
renu desai character revealed mahesh sarkaru vaari paata!  SVP లో మహేష్ వదినగా రేణు దేశాయ్.?
Pawan ex-wife to play mahesh sister-in-law? SVP లో మహేష్ వదినగా రేణు దేశాయ్.?
Advertisement
Ads by CJ

పవన్ రెండో భార్య, మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ తో విడాకులు తీసుకున్నాక తెలుగు ఇండస్ట్రీపై బాగానే ఫోకస్ పెట్టింది. బుల్లితెర మీద జేడ్జ్ గా సందడి చేసిన రేణు దేశాయ్ సినిమాలను నిర్మించడమే కాదు.. సినిమాల్లో అక్క, అమ్మ, వదిన లాంటి పాత్రలకు  సై అంటుంది. పవన్ భార్య ఇమేజ్ నుండి ఎప్పుడో దూరంగా వెళ్ళిన రేణు దేశాయ్ తానని  తాను నిరూపించుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తూనే ఉంది. అయితే తాజాగా రేణు దేశాయ్ కి టాలీవుడ్ బడా మూవీ సర్కారు వారి పాటలో మహేష్ బాబుకి అక్కగా నటించే అవకాశం వచ్చింది అనే టాక్ వినిపించింది. పరశురామ్ రేణు దేశాయ్ కి అదిరిపోయే రోల్ రాసాడని.. మహేష్ అక్కగా రేణు దేశాయ్ ఎంట్రీ సర్కారు వారి పాటలో ఉంటుంది అన్నారు.

కానీ తాజాగా సర్కారు వారి పాటలో రేణు దేశాయ్ మహేష్ బాబు కి వదిన పాత్రలో కీలకంగా కనిపించబోతుందట. రేణు దేశాయ్ భర్త కి తమ్ముడిగా మహేష్ కనిపిస్తాడని.. రేణు పాత్ర కథను మలుపు తిప్పే పాత్రగా ఉండబోతుంది అని అంటున్నారు. మరి బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేసిన కుంభకోణాల చుట్టూ సర్కారు వారి పాట కథ తిరుగుతుంది అని, బ్యాంకు మేనేజర్ కొడుకు పాత్రలో మహేష్ కనిపిస్తాడని.. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి ఆ డబ్బుతో విదేశాలకు పారిపోయిన బడా బాబుల తాట వలచి మహేష్ ఎలా ఆ డబ్బుని వెనక్కి తెచ్చాడనేదే సర్కారు వారి పాట కథ అంటూ ఓ న్యూస్ ఎప్పటినుండో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Pawan ex-wife to play mahesh sister-in-law?:

Renu Desai Character Revealed in Sarkaru Vaari Paata!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ