గుణశేఖర్ ఒకప్పుడు క్రేజి డైనమిక్ డైరెక్టర్. గుణశేఖర్ సినిమా కోసం సెట్ వేసాడంటే అదో సెన్సేషన్. కానీ కొన్నాళ్లుగా గుణశేఖర్ సినిమాలు పెద్దగా ప్రేక్షకాదరణ పొందడం లేదు. గతంలో అనుష్క మెయిన్ లీడ్ లో రానా, అల్లు అర్జున్ కీలక పాత్రల్లో నటించిన రుద్రమదేవి సినిమా సూపర్ డూపర్ హిట్టే. కానీ అంతగా ఆ సినిమాకి లాభాలు రాలేదనేది జగమెరిగిన సత్యం. తర్వాత గుణశేఖర్ కి రానా ఓ భారీ ఛాన్స్ ఇచ్చాడని, రానా మెయిన్ లీడ్ లో హిరణ్యకశిప సినిమాని తెరక్కించబోతున్నాడని రేడేళ్లు దాటింది. ఇప్పటికి హిరణ్యకశిప పట్టాలెక్కలేదు. ఈలోపు గుణ శేఖర్ పాన్ ఇండియా మూవీ శాకుంతలం లైన్ లోకి వచ్చింది.
పాన్ ఇండియా మూవీ అనగానే అందరి కళ్ళు శాకుంతలం మీదే ఉన్నాయి. శకుంతలాగా ఏ హీరోయిన్ నటించబోతుందో.. పూజ హెగ్డే అయితే ఎలా ఉంటుంది అంటూ చర్చలు కూడా జరిగాయి. కానీ గుణశేఖర్ మాత్రం హాట్ హీరోయిన్ సమంతని శకుంతలాగా దింపి షాకిచ్చాడు. మరి గ్లామర్ హీరోయిన్ సమంత శకుంతలాగా అద్భుతంగా నటిస్తుంది. అందులోను పాన్ ఇండియా మూవీ కావడంతో సమంతకి ప్లస్ అవుతుంది. కానీ అనుష్క రుద్రమదేవి గా అద్భుతంగా నటించింది. అలాగే రాణిగా మెప్పించింది. కానీ బాహుబలిలో దేవసేనకి వచ్చినంత పేరు రాలేదు. మరి ఇప్పుడు కూడా హాట్ హీరోయిన్ సమంత శాకుంతలంగా మెప్పించిన పౌరాణికం సినిమా గనక ప్రేక్షకులకు ఎక్కుతుందా.. అంటే గతంలోలా భారీగా తెరకెక్కిన రుద్రమదేవి విషయంలో జరిగిందే శకుంతలానికి జరిగి అనుష్క లాగా సమంత కూడా అన్యాయమైపోతుందా అనేది ఇప్పుడు అక్కనేని అభిమానుల ముందు ఉన్న ఆందోళన.