Advertisement

నాలుగు భారీ సినిమాల్లో ఆఫర్స్ మిస్.?

Sun 03rd Jan 2021 01:46 PM
anasuya 4 big movies favoritism  నాలుగు భారీ సినిమాల్లో ఆఫర్స్ మిస్.?
She lost her film opportunities because of favoritism!! నాలుగు భారీ సినిమాల్లో ఆఫర్స్ మిస్.?
Advertisement

హాట్ అనసూయ కి నాలుగు భారీ బడ్జెట్ మూవీస్ లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి తప్పిపోయాయట. ఈ విషయాన్ని అనసూయే స్వయంగా చెబుతుంది. ప్రస్తుతం కృష్ణవంశీ రంగమార్తాండ, రవితేజ ఖిలాడీ సినిమాల్లో కీ రోల్స్ ప్లే చేస్తున్న అనసూయ కి చిరంజీవి ఆచర్యలోను, అల్లు ఎర్జున్ పుష్ప లాంటి భారీ బడ్జెట్ మూవీస్ లో అవకాశాలొచ్చాయనే టాక్ ఉంది. పుష్ప లో డీ గ్లామర్ రోల్ చెయ్యనని అనసూయ తప్పుకుంది అనే ప్రచారం జరిగింది. కానీ అనసూయ వెర్షన్ లో సినిమా ఇండస్ట్రీలో ఫెవరేటిజం ఉన్న కారణంగానే తనకి సినిమా అవకాశాలు పోయాయని అంటుంది. ఇండస్ట్రీలో కంటికి, బయటికి కనబడని ఫెవరేటిజం ఉందంటుంది.

అసలు మనం సినిమాల్లో నటించాక.. ఆ పాత్ర తాలూకు నిడివి సినిమా విడుదలయ్యాక ఉంటుంది అనే విషయంలో క్లారిటీ ఉండదంటుంది. షూటింగ్ ఫినిష్ అయ్యాకే అసలు కథ మొదలవుతుంది అని, సినిమా విడుదలై అందులో మనం కనిపించే వరకు టెంక్షన్ గానే ఉంటుంది అంటుంది అనసూయ. మరి చాలామంది అనసూయ లాగే మేము సినిమాలో నటించాము.. కానీ సినిమా విడుదలయ్యాక లేము అంటున్నట్టే అనసూయ కూడా చెబుతుంది. ఇక తనకి నాలుగు పెద్ద సినిమాల్లో ఆఫర్స్ వచ్చి చేజారాయని, తనకు ఇస్తా అన్న పాత్రలోకి తీసుకున్న వాళ్ళు తనకంటే గొప్ప వాళ్ళు కాదని, తనకన్నా బాగా నటించేవాళ్ళు కాదని అయినా వాళ్ళకే అవకాశం వచ్చింది అంటుంది. మరి అనసూయని తప్పించిన ఆ నాలుగు పెద్ద సినిమాలు ఏమై ఉంటాయబ్బా.. అని ఇప్పుడు నెటిజెన్స్  తెగ ఆలోచించేస్తున్నారు.

She lost her film opportunities because of favoritism!!:

Anasuya lost 4 films?

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement