దర్శకుడు తేజ రానా తో నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్ళీ లైం టైం లోకి వచ్చాడు. ఆ తర్వాత సీత సినిమా చేసి ప్లాప్ కొట్టినా తేజ రానా తో ఒక సినిమా, గోపీచంద్ మరో సినిమా అనౌన్స్ చేసాడు. గత ఏడాది మొదట్లోనే తేజ రెండు సినిమాలు పట్టాలెక్కుతాయనుకుంటే.. ఇప్పటికి అవి కార్య రూపం దాల్చలేదు. మధ్యలో కరోనా మిగతా విషయాలతో తేజ గమ్మున ఉండిపోయాడు. అయితే రానా సినిమా సంగతి ఎలా ఉన్నా గోపీచంద్ తో అలివేలు వెంకటరమణ టైటిల్ తో సినిమాని ముందుగా పట్టాలెక్కించాలనుకున్నాడు. గోపీచంద్ నటిస్తున్న సీటిమార్ సినిమా ఫినిష్ కాగానే తేజ - గోపీచంద్ ల అలివేలు వెంకటరమణ సెట్స్ మీదకెళుతుందని ఫిక్స్ అయ్యారు.
ఈలోపు తేజ గోపీచంద్ కోసం అలివేలుని ఎంపిక చేస్తున్నాడనగానే అనుష్క, కీర్తి సురేష్ పేర్లు అలివేలు పాత్రకి వినిపించినా తాజాగా బాలీవుడ్ లో దున్నేస్తున్న తాప్సి పేరు బయటికి వచ్చింది. తేజ అలివేలుగా తాప్సి ని ఎంపిక చేసాడని.. త్వరలోనే ప్రకటన రాబోతుంది అనుకున్న టైం లో తేజకి వెంకటరమణ అదేనండి గోపీచంద్ హ్యాండ్ ఇచ్చాడనే టాక్ మొదలైంది. గోపీచంద్ కి అలివేలు వెంకటరమణ కన్నా యువి క్రియేషన్స్ లో మంచి ఛాన్స్ రావడంతో గోపీచంద్ దానికి షిఫ్ట్ అయ్యాడని అంటున్నారు. మారుతీ - రవితేజ కాంబోలో తెరకెక్కాల్సిన సినిమా నుండి రవితేజని తప్పించి గోపీచంద్ ని మారుతీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం యువి క్రియేషన్స్ వారు తేవడం, గోపీచంద్ కూడా ప్రభాస్ ఫ్రెండ్స్ యూవీ వారు అడిగారు కదా అని తేజ సినిమా ని పక్కనబెట్టి మారుతితో చెయ్యికలిపినట్లుగా ఫిలింనగర్ టాక్.