Advertisementt

బాలీవుడ్ రేంజమ్మా.. అడిగింది ఇవ్వాల్సిందే!

Sun 03rd Jan 2021 10:58 AM
rashmika bollywood demands remuneration  బాలీవుడ్ రేంజమ్మా.. అడిగింది ఇవ్వాల్సిందే!
Actress demands 5 crores remuneration for that film!! బాలీవుడ్ రేంజమ్మా.. అడిగింది ఇవ్వాల్సిందే!
Advertisement
Ads by CJ

తెలుగులో బిజీ తారగా ఉన్నప్పుడే రెమ్యునరేషన్ పెంచేసింది అంటే.. క్రేజ్ ఉన్నప్పుడే కదా డిమాండ్ చేయగలిగేది అంటూ రివర్స్ కౌంటర్లు వేసే రష్మిక మందన్నది ఇప్పుడు బాలీవుడ్ రేంజమ్మా. తెలుగు యంగ్ హీరోస్ తో సినిమాలు చేస్తున్న రశ్మికకి పుష్ప పాన్ ఇండియా ఆఫర్ తగలడమే సామాన్యమైన విషయం కాదు.  మరోపక్క తమిళ ఆఫర్స్ తో రష్మిక డేట్స్ కుర్ర హీరోలకి అందడం లేదు. అలాంటి రష్మిక పారితోషకంపెంచేసింది అనే టాక్ నడిచింది. అవకాశాలు ఉన్నప్పుడు అడగడం తప్పులేదని సమర్ధించుకునే రష్మిక ఇప్పుడు బాలీవుడ్ స్ట్రయిట్ సినిమాలతో దుమ్ములేపుతుంది.

సిద్దార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను తో పాటుగా అమితాబచ్చన్ సినిమాలో రష్మిక నటిస్తుంది. అమితాబచ్చన్ సినిమాకి రష్మిక 5 కోట్లు డిమాండ్ చెయ్యగానే మేకర్స్ మారుమాట్లాడకుండా ఒప్పేసుకున్నారట. ఎలాగూ బాలీవుడ్ హీరోయిన్స్ కి కోట్లు సమర్పించాల్సి ఉంటుంది. రష్మిక 5 కోట్లకు దొరొకింది అని వాళ్ళ ఫీలింగ్. కానీ రశ్మికకి అది హైయ్యెస్ట్ రెమ్యునరేషన్. ఇప్పుడు సౌత్ నిర్మాతలని డిమాండ్ చేసి మరీ వసూలు చేసుకునే స్థాయిలో ఉంది. ఎమన్నా అంటే బాలీవుడ్ క్రేజ్, బాలీవుడ్ రేంజ్ అంటుంది రష్మిక. దానితో సౌత్ నిర్మాతలకు తడిచిపోవాల్సిందే. మరి రష్మిక సౌత్ అవకాశాలతోనే చెలరేగిపోయి పారితోషకం విషయంలో నిక్కచ్చిగా ఉండేది. ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేశాక ఆగుతుందా..మరింతగా డిమాండ్ చెయ్యదూ..

Actress demands 5 crores remuneration for that film!!:

Rashmika demands huge remuneration

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ