Advertisementt

అందుకే అల్లు స్టూడియో అంటున్న బన్నీ

Sat 02nd Jan 2021 08:37 PM
allu arjun allu studios ala vaikuntapuramlo sam jam show aha  అందుకే అల్లు స్టూడియో అంటున్న బన్నీ
This is why Allu Studios is being built says Bunny అందుకే అల్లు స్టూడియో అంటున్న బన్నీ
Advertisement
Ads by CJ

2020 లో అల్లు అర్జున్ నుండి బ్లాక్ బస్టర్ అలా వైకుంఠపురములో సినిమా రావడం.. ఆ సినిమా ఇప్పటికి రికార్డులని కొల్లగొట్టడమే పనిగా పెట్టుకుంది. కరోనా తో అందరూ నష్టపోయినా అల్లు అర్జున్ మాత్రం అలా వైకుపురములో బ్లాక్ బస్టర్ ని బాగా ఎంజాయ్ చేసాడు. అదే ఏడాది అంటే 2020 లోనే అల్లు స్టూడియో కి శ్రీకారం చుట్టింది అల్లు ఫ్యామిలి. దాదాపు 1000 కోట్లతో అల్లు స్టూడియో నిర్మాణాన్ని చేపట్టింది. తాజాగా ఆహా టాక్ షో సామ్ జామ్ లో అల్లు అర్జున్ అల్లు స్టూడియో విషయాలతో పాటుగా.. అలా వైకుంఠపురములో హిట్ విషయాలను ఆ షో లో సమంతతో పంచుకున్నాడు. అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్ అంటూ చెప్పిన అల్లు అర్జున్ బుట్టబొమ్మా సాంగ్ బాగా పాపులర్ అవడానికి కారణం డేవిడ్ వార్నర్ అంటూ నవ్వేసాడు. డేవిడ్ వార్నర్ చేసిన డాన్స్ తో అలా సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి అన్నాడు.

సమంత అల్లు అర్జున్ ని అల్లు స్టూడియో కట్టాలని ఎందుకు అనిపించింది అని అడగగా.. మీకు కూడా స్టూడియోలు ఉన్నాయ్ కదా.. అంటూనే ఓ సారి అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటే.. వెల్కమ్ సర్ అన్నపూర్ణ స్టూడియో అని అన్నారు.. అప్పుడు అనిపించింది  మాక్కూడా ఓ స్టూడియో ఉంటే బాగుండు అని. అప్పుడే అల్లు స్టూడియో కి బీజం పడింది అని చెప్పాడు. సినిమాలు ఉన్నంత కాలం స్టూడియోస్ కావాలి. కేవలం మా సినిమాలకే కాదు.. మిగతా అందరి సినిమాల కోసం. అందుకే లైఫ్ లాంగ్ ఉండే స్టూడియో ఉండాలనే ఆలోచనతోనే అల్లు స్టూడియో నిర్మాణం చేపట్టాం. అన్ని సినిమాల హీరోలు సౌకర్యంగా సినిమాలు చేసుకునేలా ఈ స్టూడియో నిర్మాణం ఉంటుంది అంటూ అల్లు స్టూడియో ఎందుకు మొదలు పెట్టాడో చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. 

This is why Allu Studios is being built says Bunny:

Allu Arjun talks about allu studios and his recent movie Ala Vaikuntapuramlo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ