ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ అవడంతో యంగ్ హీరోలంతా తమ సినిమాలను థియేటర్స్ లోనే విడుదల చెయ్యడానికి రెడీ అయ్యారు. తమకి థియేటర్స్ క్రేజ్ కావాలని ఎదురు చూసిన యంగ్ హీరోస్ కి ఫలితం దక్కింది. అయితే థియేటర్స్ బంద్ ఉన్నప్పుడు చాలా సినిమాలు ఓటిటీలతో బేరసారాలకు దిగాయి. తమకు వర్కౌట్ అయిన వారు తమ సినిమాలను ఓటిటీలకు అమ్మేసారు. గత నెలలో నాగార్జున తాజా చిత్రం వైల్డ్ డాగ్ కూడా అందరిలాగే ఓటీటీకి అమ్మేశారని అన్నారు. నెట్ ఫ్లిక్స్ భారీ అమౌంట్ కి నాగ్ వైల్డ్ డాగ్ డిజిటల్ రైట్స్ దక్కించుకుని నేరుగా ఓటిటి నుండి విడుదలకు సన్నాహాలు మొదలు పెట్టింది.
వైల్డ్ డాగ్ వైల్డ్ డీల్ తో ఓటిటికి ఎంట్రీ ఇచ్చింది అని.. నెట్ ఫ్లిక్స్ నాగార్జున వైల్డ్ డాగ్ కోసం ఏకంగా 27 కోట్లు భారీ డీల్ సెట్ చెసుకుందనేది తాజా సమాచారం. 27 కోట్లకి వైల్డ్ డాగ్ ని కొనేసిన నెట్ ఫ్లిక్స్ ఆ సినిమాని ఈ నెల 26 న రిపబ్లిక్ డే రోజున అంటే జనవరి 26 న ఓటిటి నుండి విడుదలకు సన్నాహాలు చేస్తుంది అని.. త్వరలోనే వైల్డ్ డాగ్ ఓటిటి రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. నాగార్జున గత సినిమాలు అట్టర్ ప్లాప్ లిస్ట్ లో ఉన్నా వైల్డ్ డాగ్ మీదున్న క్రేజ్ వలనే నెట్ ఫ్లిక్క్ భారీ అమౌంట్ పెట్టి ఆ సినిమాని ఓటిటి లో విడుదల చేసేందుకు రెడీ అయ్యింది.