టాలీవుడ్ మెగా ఫ్యామిలీ అంటే పెద్ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలిలో ఉన్నంతమంది హీరోలు మరే ఫ్యామిలీలోను లేరు. అలాంటి ఫ్యామిలి లో ఏ అకేషన్ అయినా ఓ రేంజ్ జరగడం ఆనవాయితీ. అలాగే ఫెస్టివల్స్ అయినా, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ అయినా అందరూ మట్లాడుకునేలా జరుగుతాయి. మొన్నటికి మొన్న నాలుగు రోజుల పాటు మెగా ఫ్యామిలీ మొత్తం నిహారిక పెళ్లి వేడుకల్లో డాన్స్ లు చెయ్యడం, మెహిందీ పెట్టుకోవడం, పెళ్లి రిసెప్షన్ అబ్బో సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ చూస్తే ఇది మెగా ఫ్యామిలీ రేంజ్ అనేలా ఉంది. ఇక క్రిస్మస్ సెలెబ్రేషన్న్ కూడా మెగా యూత్ మొత్తం అదరగొట్టేసింది. కానీ న్యూ ఇయర్ వేడుకలకి మెగా ఫ్యామిలీ దూరంగా ఉంది.
కారణం చరణ్, వరుణ్ లకి కరోనా రావడమే. 31 నైట్ సెలెబ్రేషన్స్ లేవు, న్యూ ఇయర్ రోజున హడావిడి లేదు. జస్ట్ నిహారిక క్రిస్మస్ అప్పుడు మెగా యూత్ మొత్తం కలిసి హడావిడి చేసి ఛిల్ అవుతున్న ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసి కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. అలాగే తన భర్త చైతన్య తో కలిసి హాని మూన్ కి మాల్దీవుల ట్రిప్ వేసిన నిహారిక అటునుండి అటే యుఎస్ వెళుతున్నట్టుగా చెప్పుకొచ్చింది. మరి వరుణ్ కి కరోనా రావడంతో నిహారిక ఆమె భర్త కూడా టెస్ట్ చేయించగా వారికి నెగెటివ్ వచ్చింది అని నాగబాబు చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఈ న్యూ ఇయర్ కి మెగా ఫ్యామిలీ ఎక్కడివాళ్లక్కడే గప్ చుప్ గా ఉండిపోయారన్నమాట.