Advertisementt

గ్లామర్ విషయంలో తగ్గేదే లేదు

Sat 02nd Jan 2021 10:12 AM
rakul preet corona glamour show 2021  గ్లామర్ విషయంలో తగ్గేదే లేదు
In terms of glamor she doesn't seem to diminish గ్లామర్ విషయంలో తగ్గేదే లేదు
Advertisement
Ads by CJ

సినిమా అవకాశాలతో పని లేని రకుల్ ప్రీత్ సోషల్ మీడియా లో మాత్రం బిజీగానే ఉంటుంది. రకుల్ గ్లామర్ షో కానివ్వండి, రకుల్ వర్కౌట్స్ కానివ్వండి ఏదైనా సోషల్ మీడియాలో రకుల్ ఫోటో పడిపోతుంది. గ్లామర్ కి కేరాఫ్ అడ్రెస్ రకుల్ అనేలా ఉంటుంది రకుల్ ప్రీత్ అందాల ఆరబోత. ఎప్పుడూ వర్కౌట్స్ తోనే గడిపేసే రకుల్ కి కరోనా రావడం తర్వాత తగ్గడం కూడా జరిగింది. రకుల్ ప్రీత్ యోగాసనాలకు, రకుల్ వర్కౌట్స్ చూసాక కరోనా పారిపోతుంది అన్నట్టుగానే రకుల్ కరోనా త్వరగానే తగ్గిపోయింది. కరోనా తగ్గాక రకుల్ ముంబై లోని ఫ్యామిలీ కోసం వెళ్ళిపోయింది. అయితే కరోనా వచ్చినప్పుడు తనకు కాస్త నీరసం అనిపించింది అని తన క్వారంటైన్ విషయాలను పంచుకుంది.

వరస సినిమా షూటింగ్స్ వలన ఆ నీరసం వస్తుందేమో అనుకుందట. అందులోను మూడు రోజులకొకసారి చిత్ర బృందానికి కరోనా టెస్ట్ లు చేస్తారు కాబట్టి కరోనా వచ్చింది అని అనిపించలేదట. కానీ బాగా నీరసంగా అనిపించడంతో ఎందుకైనా మంచిది అని కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ రాగా.. చిత్ర బృందానికి ఇంఫామ్ చేసి హోమ్ క్వారంటైన్ కి వెళ్ళిపోయా అంటుంది రకుల్. అంతా మంచే జరుగుంతుంది హెల్డిగానే ఉన్నా అని నాకు నేను చెప్పుకుంటూ వర్కౌట్స్ చెయ్యడం, హెల్దీ ఫుడ్ తినడం వంటివి చేసి.. మెడిసిన్ తక్కువ వాడను అని చెబుతుంది రకుల్

ఇక న్యూ ఇయర్ వేడుకల్ని ఒంటరిగానే సెలెబ్రేట్ చేసుకున్న రకుల్ ప్రీత్.. న్యూ ఇయర్ రోజున 2021 కి వెల్ కం చెబుతూ గ్లామర్ లుక్ తో ఉన్న ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ న్యూ ఇయర్ రోజున అంత హ్యాపీ గా ఉండాలని, 2021 లో అందరికి మంచి జరగాలంటూ కోరుకుంటుంది రకుల్. ఇక రకుల్ ఎప్పుడూ గ్లామర్ విషయంలో తగ్గే ప్రసక్తే లేదంటూ హాట్ ఫొటోస్ తో ఎప్పుడూ రుజువు చేస్తుంది.

In terms of glamor she doesn't seem to diminish:

Rakul preet glamour show in 2021

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ