సంక్రాతి పందెం కోళ్లు రెడీ అవుతున్నాయి. సంక్రాతి రేస్ లో ఉన్న సినిమాల ప్రమోషన్స్ హడావిడి క్రిస్మస్ కే మొదలైపోయింది. రామ్ రెడ్ ట్రైలర్ తో మొదలైన సినిమాల ప్రమోషన్స్ హడావిడి.. రవితేజ క్రాక్ దగ్గర ఆగలేదు, ఇంకా అల్లుడు అదుర్స్ ప్రమోషన్స్ మొదలు కావల్సి ఉంది. ప్రస్తుతం న్యూ ఇయర్ సందర్భంగా రవితేజ - గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కిన క్రాక్ ట్రైలర్ విడుదలైంది. మాస్ మహారాజ్ పేరుకు తగ్గట్టుగానే క్రాక్ ట్రైలర్ ఉంది. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పక్కా మాస్ ఆఫీసర్ గా కనబడుతున్నాడు. 'చూసారా జేబులో ఉండాల్సిన నోటు, చెట్టుకు ఉండాల్సిన కాయ, గోడకు ఉండాల్సిన మేకు.. మూడు ముగ్గురు తోపులని తొక్కి నరతీసాయ్.. ఇక్కడ కామన్ పాయింట్ ఏమిటి అంటే.. ముగ్గుర్ని ఆడుకుంది ఒక్క పోలీసోడే..' అనే వెంకటేష్ వాయిస్ ఓవర్ తో క్రాక్ ట్రైలర్ మొదలయ్యింది.
క్రాక్ లో విలన్స్ గా నటించిన సముద్ర ఖని విలనిజం, వరలక్ష్మి శరత్ కుమార్ విలనిజంతో పాటుగా రవితేజ మాస్ డైలాగ్స్ కేక పెట్టిస్తున్నాయి. అలాగే హీరోయిన్ శృతి హాసన్ తో రొమాంటిక్ యాంగిల్, విలన్స్ ని చితక్కొట్టే పవర్, రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్ర, రవితేజ ఎనేర్జి లెవెల్స్ అన్ని మాస్ ఆడియన్స్ కి ఎక్కేసేలానే ఉన్నాయి. ఇక రవితేజ చివరిగా 'చిన్న బ్రేక్ ఇచ్చానంతే. ఈ లోపు ఎన్ని యాడ్లు వేసేసుకుంటావో వేసేస్కో' అనే డైలాగ్ కి థియేటర్స్ దద్దరిల్లసిందే. మరి మాస్ గా కట్ చేసిన క్రాక్ ట్రైలర్ చూస్తే సినిమా మొత్తం రవితేజ ఎనర్జీతో మాస్ ఆడియన్స్ ని పడెయ్యడం ఖాయంలాగే కనబడుతుంది.