మెగా హీరోల్లో రామ్ చరణ్, వరుణ్ తేజ్ లకి కరోనా సోకడంతో న్యూ ఇయర్ వేడుకలకి మెగా ఫ్యామిలీ మొత్తం దూరంగా ఉంది. రామ్ చరణ్, వరుణ్ తేజ్ లు హోమ్ క్వారంటైన్ లో ఉండడంతో మెగా ఫ్యామిలీ కూడా గప్ చుప్ గా న్యూ ఇయర్ కి వెల్ కామ్ చెప్పేసింది. అయితే మెగా హీరోగా గత ఏడాది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ తేజ్ ఇపుడూ భయపడుతున్నట్టుగా కనబడుతుంది వ్యవహారం. అంటే వైష్ణవ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన గత ఏడాది మార్చ్ లోనే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా తో థియేటర్స్ బంద్ వలన ఉప్పెన విడుదల వాయిదాల మీద వాయిదాలు పడింది. థియేటర్స్ బంద్ వలన ఓటిటి వాళ్ళు ఉప్పెనకి అదిరిపోయే రేటు ఇస్తామన్నా మెగా హీరో వైష్ణవ తేజ్ ఒప్పుకోలేదు. మా సినిమా థియేటర్స్ లోనే విడుదల కావాలని పట్టుపట్టుకుని కూర్చున్నాడు.
అయితే థియేటర్స్ ఓపెన్ అయ్యాయి.. వైష్ణవ తేజ్ అన్నగారు సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ థియేటర్స్ లో విడుదలైంది.,. సో సో టాక్ తెచ్చుకున్నా మిగతా హీరోలకు ధైర్యాన్ని అయితే ఇవ్వగలిగింది. సోలో బ్రతుకే సో బెటర్ థియేటర్స్ రెస్పాన్స్ చూసిన రామ్, రవితేజ, బెల్లంకొండ శ్రీనివాస్ లు తమ సినిమాలని సంక్రాంతికి విడుదల చెయ్యడానికి రిలీజ్ డేట్స్ ఇవ్వడమే కాదు.. అందుకు కావాల్సిన ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాల హడావిడి ఎంతగా ఉందో.. రామ్ రెడ్, రవితేజ క్రాక్, బెల్లంకొండ అల్లుడు అదుర్స్ సినిమాల హడావిడి అంతే ఉంది. మరి కరోనా తో ఆగిన థియేటర్స్ మళ్ళీ తెరుచుకుని హీరోలంతా సినిమాల రిలీజ్ డేట్స్ ఇస్తున్నా వైష్ణవ తేజ్ మాత్రం కామ్ గా సైలెంట్ గా ఎందుకున్నాడో?
50 శాతం ఆక్యుపెన్సీ సరిపోదనా? లేదంటే సంక్రాతి హీరోల ముందు మనమెంత అనుకున్నాడా? లేదు థియేటర్స్ కి ప్రేక్షకులు అలవాటు పడ్డాకే ఉప్పెన విడుదల చేద్దామనుకుంటున్నాడో కానీ.. ప్రస్తుతం ఉప్పెన మాట సోషల్ మీడియాలో కానరావడం లేదు.