2020 కరోనా నామ సంవత్సరానికి బై బై చెప్పడానికి టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు హీరోయిన్స్ అందరూ వెకేషన్స్ ప్లాన్ చేసుకుని బాయ్ ఫ్రెండ్స్ తో సముద్ర తీరాలకు చెక్కేశారు. బీచ్ ల వెంట బికినీ తో మంటలు పుట్టిస్తున్న హీరోయిన్స్ 2020 కి ఎంత త్వరగా గుడ్ బై చెప్పేద్దామా అని ఆత్రుతతో ఉన్నారు. టాలీవుడ్ బ్యాచ్ చాలావరకు గోవాకి చెక్కేస్తే.. బాలీవుడ్ బ్యాచ్ మాత్రం మాల్దీవులకు చెక్కేసింది. సమంత భర్త చైతు తో కలిసి గోవా బీచ్ కి వెళ్లిపోగా.. విజయ్ దేవరకొండ కూడా గోవానే ఎంచుకున్నాడు. అలాగే మలైకానందం మలైకా అరోరా సిస్టర్ తో కలిసి గోవాలో బికినీ షోతో సెగలు తెప్పిస్తుంది.
ఇక కియారా అద్వానీ బాయ్ ఫ్రెండ్ సిద్దార్థ్ హోత్రతో కలిసి మాల్దీవుల ట్రిప్ వేసింది. వెళ్లడం వెళ్లడమే మాల్దీవుల్లో హాట్ షో స్టార్ట్ చేసింది. ఇక విజయ్ దేవరకొండ హీరోయిన్ ఫైటర్ భామ అనన్య పాండే మాల్దీవుల్లో బికినీ రచ్చ మాములుగా లేదు. మాల్దీవులలో సముద్రానికి చమట్లు పట్టిస్తుంది అనన్య. ఇక అలియా భట్ బాయ్ ఫ్రెండ్ రణబీర్ ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్ లోని జైపూర్ లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ప్లాన్ చేసుకుంది. మరి సమంత - చైతు, శిల్పా రెడ్డి బ్యాచ్ గోవా బీచ్ వెంట న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకుంటుంటే.. బాలీవుడ్ హీరోయిన్స్ మొత్తం బికినీ షోస్ తో మాల్దీవుల బీచ్ లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బీచ్ లో బికినీ షోస్ తో 2020 కి గుడ్ బై చెబుతూ 2021 కి స్వాగతం పలుకుతున్నారు.