పవన్ కళ్యాణ్ 2020 లో ఏమంటూ సినిమాల్లోకి కం బ్యాక్ ఇచ్చాడో కానీ.. కరోనా తో కాలం స్తంభించింది. ఒప్పుకున్న వకీల్ సాబ్ ని ఏడాది మొత్తం షూటింగ్ చేస్తూనే ఉన్నాడు(మధ్యలో కరోనాతో 7 నెలలు షూటింగ్ కి బ్రేక్ వచ్చింది). మొత్తానికి మొన్నీమధ్యనే వకీల్ సాబ్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాని తెగ ప్రమోట్ చేస్తున్నాడు. ఏపీ రాజకీయాల్లో వకీల్ సాబ్ గా పవన్ కళ్యాణ్ అటు సినిమాని ప్రమోట్ చేస్తూ.. ఇటు వైసిపి నాయకులకు చురకలు వేస్తున్నాడు. తాజాగా గుడివాడలో పర్యటించిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ వస్తున్నాడు, వకీల్ సాబ్ చెబుతున్నాడు అంటూ స్పీచ్ లు ఇస్తున్నాడు. గుడివాడ ఎమ్యెల్యే ఎవరో నాని అంట.. శతకోటి లింగాల్లో బోడి లింగం, శతకోటి నానీల్లో ఒక నాని గారికి అంటూ వెటకారమాడిన పవన్ వకీల్ సాబ్ డైలాగ్స్ మాట్లాడేస్తున్నాడు.
మీ సీఎం జగన్ రెడ్డి గారు అదే సీఎం సాబ్ కి చెప్పండి.. వకీల్ సాబ్ చెప్పాడని అంటూ పవన్ నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్ టైటిల్ ని పదే పదే ఉచ్చరిస్తూ సినిమాని ప్రజల్లోకి తీసుకెళుతున్నాడు. వకీల్ సాబ్ కోసం ప్రెస్ మీట్ పెట్టి ప్రమోట్ చేసే కన్నా ఇలా జనల మధ్యన ప్రమోట్ చేస్తే సినిమాపై క్రేజ్ మరింతగా పెరుగుతుంది. అందుకే పవన్ అటు రాజకీయాలతో పాటుగా ఇటు సినిమా ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు అంటే.. దర్శకనిర్మాతలకు పండగే. పవన్ అలా పబ్లిక్ లో వకీల్ సాబ్ ముచ్చట ఎత్తడం పవన్ ఫాన్స్ కే కాదు.. ఇటు సాధారణ ప్రేక్షకుడికి సినిమాపై ఆసక్తి పెరిగేలా కనబడుతుంది.