లాక్ డౌన్ మొదలుకాగానే అన్ని సినిమా షూటింగ్స్ ప్యాకప్ చెప్పేసినట్లుగానే నితిన్ - వెంకీ అట్లూరిల రంగ్ దే సినిమా షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. అయితే మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టిన తరుణంలో రంగ్ దే సినిమా కి ఓటిటి నుండి భారీ ఆఫర్స్ మొదలు కావడంతో.. నితిన్ ఓటిటికి టెంప్ట్ అవుతున్నాడని టాక్ నడిచింది. కానీ నితిన్ అండ్ వెంకీ అట్లూరిలు రంగ్ దే సినిమాని సంక్రాంతికి థియేటర్స్ లో రిలీజ్ చేస్తాం అంటూ పోస్టర్స్ తో హడావిడి మొదలు పెట్టారు. మరి సంక్రాంతికి రిలీజ్ అంటూ సినిమా షూటింగ్ చేసుకుంటున్న నితిన్ - వెంకీల అడ్రెస్స్ లేరు. రవితేజ క్రాక్, రామ్ రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అంటూ డేట్స్ ఇచ్చేసాయి.
అలాగే సోషల్ మీడియా ప్రమోషన్స్ మొదలు పెట్టేశాయి. కానీ నితిన్ రంగ్ దే హడావిడి లేదు. అసలు నితిన్ సంక్రాతి బరి నుండి తప్పుకునే ఉంటాడు.. అందుకే రంగ్ దే హడావిడి లేదు అంటున్నారు. సినిమా షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బ్యాలెన్స్ ఉండడంతో నితిన్ - వెంకీ లు సంక్రాతి బరి నుండి తప్పుకున్నారని సమాచారం ఉన్నా.. నితిన్ క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నితిన్ రంగ్ దే సంక్రాతి రేస్ నుండి తప్పుకుని మార్చి కి వెళ్ళిపోయింది అనే టాక్ అయితే మొదలయ్యింది. మరి నితిన్ - వెంకీలు రంగ్ దే గురించి స్పందిస్తేనే కాని అసలు విషయం తెలియదు.