Advertisementt

ఫాన్స్ కోరిక ప్రభాస్ తీరుస్తాడా?

Thu 31st Dec 2020 08:30 AM
prabhas,radheshyam,salaar,2021  ఫాన్స్ కోరిక ప్రభాస్ తీరుస్తాడా?
Prabhas double dhamaka in 2021? ఫాన్స్ కోరిక ప్రభాస్ తీరుస్తాడా?
Advertisement
Ads by CJ

ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ ఉన్న కథానాయకుడు. టాలీవుడ్ నుండి ఏ హీరోకి దక్కని గౌరవం, క్రేజ్ ప్రభాస్ సొంతం అయ్యాయి. ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా క్రేజి ప్రాజెక్ట్స్ తో ప్రభాస్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. రాధేశ్యాం షూటింగ్ మరో నెల రోజుల్లో కంప్లీట్ చేస్తున్న ప్రభాస్ జనవరి మొదటి వారం నుండి ఓం రౌత్ ఆదిపురుష్ ఫస్ట్ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. మరోపక్క నాగ్ అశ్విన్ సినిమాని 2021 లోనే మొదలు పెట్టనున్న ప్రభాస్ ప్రశాంత్ నీల్ సలార్ ని మాత్రం తొందరగానే చక్కబెట్టేస్తాడనే టాక్ వినిపిస్తుంది. 2021 లో ప్రభాస్ నుండి డబుల్ ధమాకా ఉండబోతుందని అంటున్నారు.

ప్రభాస్ ఫాన్స్ అయితే 2021 వేసవిలో రాధేశ్యాం విడుదల.. అలాగే 2021 చివరిలో అంటే దసరా కి సలార్ విడుదల అవ్వాల్సిందే అంటున్నారు. ఎలాగూ సాలార్ రీమేక్. అందులోను ప్రశాంత్ నీల్ చాలా ఫాస్ట్ గా సినిమాని కంప్లీట్ చేస్తాడు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే రాధేశ్యాం - సలార్ సినిమాల విడుదల డేట్స్ ఉంటాయని అనుకుంటున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో రాధేశ్యాం రిలీజ్ ఉంటే.. ప్రశాంత్ నీల్ కాంబోలో సలార్ మరో నాలుగు నెలల్లోనే కంప్లీట్ చేసి విడుదల డేట్ ఇవ్వొచ్చంటున్నారు. ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ డేట్స్ ఇస్తే నాలుగు నెలల్లో సినిమా కంప్లీట్ చేస్తా అని మాటిచ్చాడట. మరి రాధేశ్యాం - సలార్ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో ఒకే ఏడాది విడుదల చేస్తే ప్రభాస్ ఫాన్స్ ఆగుతారా.. ఫాన్స్ మాత్రం అదే కోరుకుంటున్నారు. మరి ప్రభాస్.. ఫాన్స్ కోరిక తీరుస్తాడా అనేది కొద్దిపాటి సందేహం.

Prabhas double dhamaka in 2021?:

Prabhas Radheshyam and Salaar to Release 2021

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ