Advertisementt

ఎన్టీఆర్ విలన్ అతనేనా?

Thu 31st Dec 2020 08:20 AM
trivikram,ntr,upendra,villain role  ఎన్టీఆర్ విలన్ అతనేనా?
Is he NTR's villain? ఎన్టీఆర్ విలన్ అతనేనా?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం RRR హీరోల్లో రామ్ చరణ్ కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ ఐసోలేషన్ లో ఉంటే.. ఎన్టీఆర్ మాత్రం RRR షూటింగ్ కి కొద్దిపాటి విరామం ఇచ్చి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని తన కుటుంబంతో ఇంట్లోనే చేసుకోబోతున్నాడట. మరి ఎన్టీఆర్ RRR షూటింగ్ ఫినిష్ అవ్వగానే త్రివిక్రమ్ సినిమాకి షిఫ్ట్ కావాలి. RRR తర్వాత మాస్ యాక్షన్ మూవీ కన్నా త్రివిక్రమ్ తో సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కే ఫిక్స్ అయిన ఎన్టీఆర్ ఈ సినిమాలో రాజకీయాలను కెలకబోతున్నాడనే టాక్ నడుస్తుంది. త్రివిక్రమ్ తో ఫ్యామిలీకి నచ్చే కామెడీతో స్క్రిప్ట్ రెడీ చేయించాడని.. అందులోనే రాజకీయాలకు సంబందించిన ఎపిసోడ్ కూడా ఉండబోతుందట.

అయితే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ ని ఢీ కొట్టబోయే స్టైలిష్ విలన్ ని త్రివిక్రమ్ ఇప్పటికే ఫైనల్ చేసాడనే టాక్ మొదలయ్యింది. RRR తర్వాత ఎన్టీఆర్ ని ఇంకా పవర్ ఫుల్ గా చూపించాలంటే.. పవర్ ఫుల్ విలన్ ఉండాల్సి ఉంటుంది. అందుకే త్రివిక్రమ్ గతంలో  సన్ అఫ్ సత్యమూర్తి లో సెకండ్ హాఫ్ లో విలన్ గా తీసుకొచ్చిన ఉపేంద్రనే మరోసారి ఎన్టీఆర్ కోసం కూడా తీసుకురాబోతున్నాడట. RRR తర్వాత ఎన్టీఆర్ కి హిట్ ఇవ్వాలనే తపనతో త్రివిక్రమ్ ఉన్నాడని.. ప్రస్తుతం ఎన్టీఆర్ స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతున్నాడని.. ఎన్టీఆర్ కోసం ఇద్దరు హీరోయిన్స్ ని ఈ సినిమాలో డిజైన్ చేసాడని.. అలాగే స్టైలిష్ గా ఉండేలా విలన్ పాత్ర రాసుకున్నాడని అంటున్నారు. అంటే ఈ సినిమాలో విలన్ స్టైలిష్ పవర్ ఫుల్ రాజకీయనాయకుడిగా ఉంటాడట. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ విలన్ దాదాపుగా ఉపేంద్రే ఫిక్స్ అంటున్నారు.

Is he NTR's villain?:

Upendra's Villain Role in NTR's Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ