Advertisementt

న్యూ ఇయర్ సెలెబ్రేషన్సా.. అమ్మో అంటున్నారు!

Wed 30th Dec 2020 09:21 PM
new year celebrations,mega family,ram charan,varun tej,corona,new year,celebrations  న్యూ ఇయర్ సెలెబ్రేషన్సా.. అమ్మో అంటున్నారు!
New Year Celebrations a big threat! న్యూ ఇయర్ సెలెబ్రేషన్సా.. అమ్మో అంటున్నారు!
Advertisement
Ads by CJ

ఈ 2020 లో కరోనా తో కాలం ఆగిపోయినా.. మెగా ఫ్యామిలీ ఇంట నిహారిక పెళ్ళి సందడి వేరే లెవల్లో జరిగింది. మెగా ఫ్యామిలిలో చిరు, పవన్, నాగబాబు, అల్లు అరవింద్ ఫామిలీస్ అన్ని రాజస్థాన్ నుండి హైదరాబాద్ వరకు నిహారిక పెళ్లి లో సందడి సందడి చేసారు. అందరూ ఒకే చోట చేరి సంగీత్, మెహిందీ, పెళ్లి, రిసెప్షన్ అంటూ హడావిడి హడావిడి చేసారు. నిహారిక పెళ్లి వేడుకలు అలా ముగిశాయో లేదో.. మెగా ఫ్యామిలీ యూత్ అంటే రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహ, చిరు కూతుళ్లు, న్యూ కపుల్ నిహారిక - చైతన్య, సాయి ధరమ్, శిరీష్, బాబీ ఇలా మెగా కజిన్స్ మొత్తం క్రిస్మస్ సెలెబ్రేషన్స్ అంటూ ఒకే చోట చేరి సందడి చేసారు.

ఇక న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి రెడీ అవుతున్న తరుణంలో రామ్ చరణ్ కి కరోనా పాజిటివ్ రావడం, వెనువెంటనే వరుణ తేజ్ కి కరోనా సోకడంతో మెగా ఫ్యామిలీ అంతా గప్ చుప్ అయ్యారు. అల్లు అర్జున్ ఫ్యామిలీతో న్యూఇయర్ వేడుకలకు ఎక్కడికైనా వెకేషన్ వెళ్ళేవాడే. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కూడా గడప దాటడం లేదు. ఎక్కడికి సెలెబ్రేషన్స్ కోసం వెళ్లకపోయినా.. మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే చోట చేరి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ అయినా చేసుకునేది. కానీ ఇప్పుడు కరోనా కారణంగా సెలెబ్రేషన్స్ అంటే అమ్మో అనేస్తున్నారు మెగా ఫ్యామిలీ మెంబెర్స్. నిహారిక పెళ్లి, క్రిస్మస్ వేడుకల తర్వాత న్యూ ఇయర్ ని గ్రాండ్ గా చేద్దామనుకుంటే ఈ కరోనా ఏంట్రా బాబు.. ఇలా మనతో ఆడేసుకుంటుంది అని అనుకుంటున్నారట.

New Year Celebrations a big threat!:

New Year Celebrations skipped in Mega Family

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ