Advertisementt

కాజల్, తమన్నా, పూజ కి స్పాట్ పెట్టగలదా?

Wed 30th Dec 2020 02:59 PM
pooja,tamanna,kajal,monal,alludu adurs  కాజల్, తమన్నా, పూజ కి స్పాట్ పెట్టగలదా?
Can she compete with Pooja, Tamanna and Kajal? కాజల్, తమన్నా, పూజ కి స్పాట్ పెట్టగలదా?
Advertisement
Ads by CJ

టాప్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్ చెయ్యడానికి కెరీర్ పీక్స్ లో ఉన్న హీరోయిన్స్ అస్సలు ఆలోచించడం లేదు. డబ్బుకి డబ్బు, క్రేజ్ కి క్రేజ్ వస్తున్నప్పుడు హీరోయిన్స్ మాత్రం ఎందుకూరుకుంటారు. గతంలో కాజల్ అగర్వాల్ పలు హీరోల సినిమాల్లో నటిస్తున్నప్పుడే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాలో పక్కా లోకల్ సాంగ్ తో అదరగొట్టేసింది. గ్లామర్ డ్రెస్సులతో, హాట్ హాట్ డాన్స్ స్టెప్స్ తో ఎన్టీఆర్ పక్కన ఆడిపాడింది.  తమన్నా అయితే జై లవ కుశ లో స్వింగ్ జరా స్వింగ్ జరా అంటూ అదరగొట్టడమే కాదు.. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాలోనూ ఐటెం తో అదరగొట్టింది. ఇక పూజ హెగ్డే టాప్ హీరోయిన్ గా సినిమాలు చేస్తున్నప్పుడే రామ్ చరణ్ రంగస్థలంలో జిగేలు రాణి అంటూ మైమరపింపజేసింది. 

కెరీర్ టాప్ లో ఉండగానే ఐటెం సాంగ్స్ లో అదరగొట్టిన కాజల్, తమన్నా, పూజ లాంటి హాట్ హీరోయిన్స్ కి బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ స్పాట్ పెట్టగలదా? క్రేజీ హీరోయిన్స్ తో కలిసి నటించే బెల్లంకొండ శ్రీనివాస్.. ఇప్పుడు కూడా బిగ్ బాస్ లో గ్లామర్ షో చేసి.. ఇప్పటికీ గ్లామర్ తో రెచ్చిపోతున్న మోనాల్ గజ్జర్ క్రేజ్ ని అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెం లోకి లాగేసాడు. మోనాల్ గ్లామర్ షోకి ఇప్పుడు అందరూ పడిపోతున్నారు. అందుకే మోనాల్ ఎక్కడా తగ్గడం లేదు. గ్లామర్ తోనే క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది. అల్లరితో పని జరగకపోయినా బిగ్ బాస్ తో అందరి చూపు తనవైపు తిప్పేసుకున్న మోనాల్ కాజల్, తమన్నా, పూజ ల గ్లామర్ ముందు తేలిపోతుందో? లేదంటే వాళ్ళకి గట్టి పోటీ ఇస్తుందో? చూద్దాం.  

Can she compete with Pooja, Tamanna and Kajal?:

Monal will be doing a special song in Alludu Adhurs

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ