Advertisementt

సర్కారు వారి పాటలో హాట్ యాంకర్?

Wed 30th Dec 2020 01:07 PM
anasuya bharadwaj,mahesh,sarkaru vaari paata  సర్కారు వారి పాటలో హాట్ యాంకర్?
Hot anchor in Sarkaru vaari Paata? సర్కారు వారి పాటలో హాట్ యాంకర్?
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - పరశురామ్ ల సర్కారు వారి పాట సెట్స్ మీదకెప్పుడు వెళుతుందా అని మహేష్ అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు . కీర్తి సురేష్ హీరోయిన్ గా త్వరలోనే పట్టాలెక్కనున్న సర్కారు వారి పాట లో మహేష్ బాబు ని ఢీ కొట్టబోయే విలన్ పేరు ఇంకా బయటికి రాలేదు. అయితే తాజాగా మహేష్ బాబు సర్కారు వారి పాటలో జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ ఓ రోల్ చేయబోతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం బుల్లితెర మీదే కాదు.. వెండితెర మీద కూడా అనసూయ అవకాశాల జోరు మాములుగా లేదు. ఇప్పటికే అనసూయ నటించిన థాంక్యూ బ్రదర్ విడుదలకు సిద్ధమవుతుంటే కృష్ణవంశీ రంగమార్తాండ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

అంతేకాకుండా రవితేజ ఖిలాడీ సినిమాలో అనసూయ రవితేజ తో పాటుగా ఢీ అంటే ఢీ అనే కీలకపాత్రలో నటించబోతుంది. ప్రస్తుతం ఖిలాడీ సినిమా సెట్స్ మీదుంది. అలాగే అనసూయ పుష్ప సినిమాలోనూ ఓ పాత్ర చేయబోతుంది అనే టాక్ ఉండగా.. ఇప్పుడు సర్కారు వారి పాటలో ఓ పాత్ర కి  అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్. దర్శకుడు పరశురామ్ మహేష్ కోసం ప్రత్యేకమైన కామెడీ ఎపిసోడ్ ఒకటి డిజైన్ చేసాడని.. ఆ ఎపిసోడ్ లోనే అనసూయ నటించబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.

Hot anchor in Sarkaru vaari Paata?:

Anasuya Bharadwaj in Mahesh Sarkaru Vaari paata?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ