RRR హీరో రామ్ చరణ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. నిహారిక పెళ్లి వేడుకలు, క్రిస్మస్ సెలెబ్రేషన్స్, RRR షూటింగ్ తో బిజీగా ఉన్న రామ్ చరణ్ కి కరోనా సోకడంతో మెగా ఫాన్స్ కంగారు పడుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ RRR షూటింగ్ లో బిజీగా ఉండడం, అలాగే జనవరి నుండి చిరు ఆచార్య షూటింగ్ లోకి చరణ్ అడుగుపెట్టడం వంటి విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మూడునాలుగు రోజుల క్రితం రామ్ చరణ్ నిర్మాత హోదాలో ఆచార్య సెట్స్ లోకి అడుగు కూడా పెట్టాడు. మరోపక్క రాజమౌళి ఏప్రిల్ కల్లా RRR షూటింగ్ ఫినిష్ చేసే దిశగా నిర్విరామంగా షూటింగ్ జరుపుతున్న వేళ రామరాజు కి కరోనా సోకడం కాస్త షాకిచ్చే విషయమే. మరి రామరాజు కి కరోనా సోకడంతో హోమ్ క్వారంటైన్ కి వెళ్ళిపోతే ఆయన సీతమ్మ అదేనండి అలియా భాట్ మాత్రం వెకేషన్స్ ప్లాన్ చేసింది.
అలియా భాట్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి చెక్కేసింది. తాజాగా అలియా భట్ రణబీర్ కపూర్ ఫ్యామిలీ కలిసి వెకేషన్స్ కి వెళుతున్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే.. రామరాజుకి కరోనా కాని సీతమ్మకి మాత్రం వెక్సేషన్స్ తో ఎంజాయ్మెంట్ అంటున్నారు నెటిజెన్స్. రామ్ చరణ్ కరోనా కారణముగా హోమ్ ఐసొలేషన్స్ కి వెళితే సీతమ్మ అలియా భట్ మాత్రం న్యూ ఇయర్ వేడుకల కోసం వెకేషన్స్ ప్లాన్ చేసుకోవడం మెగా ఫాన్స్ కి నచ్చడం లేదు. ప్రస్తుతం సెలబ్రిటీస్ అంతా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం సేఫ్ గా ఉంటుంది కదా అని గోవా ని ఎంచుకుని గోవా ఫ్లైట్స్ ఎక్కేయ్యడం అది కాస్త కెమెరామ్యాన్స్ కంటికి చిక్కడం జరుగుతూనే ఉంది. బాలీవుడ్ నుండి మలైకా అరోరా ఆమె సిస్టర్, కరణ్ జోహార్ లాంటి సెలెబ్రెటీస్ అప్పుడే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం గోవాకి చెక్కేశారు.