Advertisementt

చిరుపై సంచలనం వ్యాఖ్యలు చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్!

Mon 04th Jan 2021 06:44 PM
amma rajasekhar,sensational,comments,chiru  చిరుపై సంచలనం వ్యాఖ్యలు చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్!
Bigg Boss contestant who made sensational comments on Chiru! చిరుపై సంచలనం వ్యాఖ్యలు చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరు బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలేలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఆఫర్స్ ఇవ్వడమే కాదు.. బిగ్ బాస్ లో కామెడీతో అదరగొట్టిన డాన్స్ మాస్టర్ అమ్మ రాసేఖర్ గురించి ఓ సీక్రెట్ రివీల్ చేసాడు. అది అమ్మ రాజశేఖర్ దర్శకుడిగా మారి రణం సినిమాని డైరెక్ట్ చేయ్యకముందు తన దగ్గర 15 లక్షలు అడ్వాన్స్ తీసుకుని ఇప్పటివరకు సినిమా చెయ్యలేదని చెప్పాడు. ఆ విషయాన్నీ అమ్మా కూడా ఒప్పుకున్నారు. కొన్ని అనివార్యకారణాల వలన సినిమా చేయలేకపోయా అని చెప్పాడు. అయితే ఇప్పుడు అవకాశం ఇస్తే గబ్బర్ సింగ్ లాంటి కథతో సినిమా చేస్తా అని అమ్మ రాజశేఖర్ అనగానే.. నేను మళ్ళీఅడ్వాన్సు ఇవ్వను.. అప్పుడు ఇచ్చిందే వడ్డీతో కలిపి కోట్లు అయ్యి ఉంటుంది అంటూ హాస్యం చేసాడు చిరు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ చిరు కోసం గబ్బర్ సింగ్ లాంటి కథ రెడీ చేశా అని.. కాకపోతే చిరంజీవి గారు రీమేక్ కథలు చెయ్యడం తనకి నచ్ఛలేదని.. చిరు గారు కొత్త కథలతో సినిమాలు చేయాలి. ఆయన లాంటి స్టార్ హీరోలు రీమేక్‌ చేయడం వల్ల లాభం ఉండదు. ఎందుకంటే ఓటిటీల ద్వారా అన్ని భాషల సినిమాలని ప్రేక్షకులు ముందే చూసేస్తున్నారు. అందువల్ల రీమేక్ లు పెద్దగా ఆడవు. అందుకే ఈ విషయంలో చిరు ధైర్యం చేసి.. కొత్త కథలతోనే సినిమాలు చెయ్యాలి అంటూ సంచలనంగా మాట్లాడాడు అమ్మ రాజశేఖర్.

Bigg Boss contestant who made sensational comments on Chiru!:

Amma Rajasekhar sensational comments on Chiru

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ